Chandra Grahan 2025: చంద్ర గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

చంద్ర గ్రహణం రోజున గర్భిణీలు బయటకు వెళ్లడం, పదునైన వస్తువులు వాడటం, వంట చేయడం లేదా ఆహారం తినడం వంటివి చేయకూడదని సాంప్రదాయ నమ్మకం. ఇలా చేస్తే కడుపులోని బిడ్డకు హాని జరుగుతుందని విశ్వసిస్తారు. విశ్రాంతి తీసుకోవడం, మంత్రాలు జపించడం వంటివి చేయాలని సూచిస్తారు.

New Update
Chandra Grahan 2025 (1)

Chandra Grahan 2025

ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం ఈ నెల అంటే సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడనుంది. ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. ఇది భారతదేశంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని భారతదేశంలోని ప్రజలు రాత్రి వేళ వీక్షించవచ్చు. రాత్రి 9:58 నుండి తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. అంటే మొత్తం 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది. 

Chandra Grahan 2025 Tips

ఖగోళ శాస్త్రం ప్రకారం.. చంద్రగ్రహణం ఒక సాధారణ ఖగోళ ప్రక్రియ మాత్రమే. అయితే భారతీయ సంప్రదాయాలు, జ్యోతిష్యం ప్రకారం దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాగా ఈ గ్రహణానికి సూతక కాలం వర్తిస్తుంది. ఈ కాలం మధ్యాహ్నం 12:57 నిమిషాలకు ప్రారంభమై గ్రహణం ముగిసే వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆలయాలు మూసివేస్తారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పెద్దలు సూచిస్తారు.

ముఖ్యంగా చంద్ర గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు కొన్ని పనులు చేయకూడదని సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిష్య శాస్త్రం సూచిస్తాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. గ్రహణం సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లడం అశుభంగా భావిస్తారు. ఆ సమయంలో బయటకు వెళ్తే చంద్రుని కాంతి గర్భిణీ స్త్రీ శరీరంపై పడుతుందని.. దానివల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కత్తెరలు, బ్లేడ్లు, కత్తులు లేదా ఏదైనా పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఒకవేళ ఇలా చేస్తే పుట్టబోయే బిడ్డకు శారీరక లోపాలు లేదా పుట్టు మచ్చలు వస్తాయని ఒక నమ్మకం.

అలాగే చంద్రగ్రహణం, దాని సూతక కాల సమయంలో ఆహారం వండటం లేదా తినడం కూడా మంచిది కాదని నమ్ముతారు. గ్రహణం ప్రతికూల శక్తి ఆహారాన్ని కలుషితం చేస్తుందని.. ఇది పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అంటారు. అయితే అవసరమైతే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో చంద్రకాంతిని నేరుగా తాకకూడదు. దీని కోసం తలుపులు, కిటికీలను మూసి ఉంచడం మంచిదని భావిస్తారు.

Advertisment
తాజా కథనాలు