/rtv/media/media_files/2025/12/02/cricket-2025-12-02-07-21-57.jpg)
భారత జట్టుకు గంభీర్ కోచ్ అయిన దగ్గర నుంచీ ఎదో ఒక గొడవ అవుతూనే ఉంది. ఇప్పటికీ జట్టులో ఆటగాళ్ళ ఎంపికపై చర్చ నడుస్తూనే ఉంది. దానికి తోడు సీనియర్లు రో-కో, గంభీర్ మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. రోహిత్, కోహ్లీ టెస్ట్ లకు దూరం అవడానికి కారణం కోచ్ గంభీరే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పడు వన్డే జట్టులో సీనీయర్లు ఇద్దరూ ఉన్నా..కోచ్ కు మాత్రం దూరంగానే ఉంటున్నారు. రో-కో 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనే ఆలోచనతో ఉన్న నేపథ్యంలో వీరికి, కోచ్‌కు మధ్య నెలకొన్న అంతరం తగ్గాల్సిందే. దీని కోసం బీసీసీఐ ఈ రోజు సమావేశం నిర్వహిస్తోంది.
వాళ్ళిద్దరి వల్లనే..
కోచ్ గంభీర్, ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇద్దరి మీదా భారత క్రికెట్ అభిమానులు చాలా రోజుల నుంచీ కోపంగానే ఉన్నారు. రఓమిత్ శర్మ, కోహ్లీలు జట్టులో నుంచి వెళ్ళిపోవడానికి కారణం వీరిద్దరే అనే చర్చ చాలా రోజుల నుంచీ నడుస్తూనే ఉంది. కోచ్ గంభీర్ కారణంగానే రోహిత్, కోహ్లీలు టెస్ట్ లకు గుడ్ బై చెప్పారని అభిమానులు అభిప్రాయం. దీనికి తోడు రోహిత్ ను వన్డే కెప్టెన్ గా కోచ్ గంభీర్ వల్లనే తప్పించారని అంటున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియావైట్‌వాష్‌కు గురి కావడంతో..ఇదంతా గంభీర్, అగార్కర్ వల్లనేఅంటూ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరాభవానికి బాధ్యత తీసుకుని గంభీర్ కోచ్‌గా తప్పుకోవాలనే డిమాండ్లు గట్టిగా వినిపించాయి. రెండో టెస్టు ఓటమి అనంతరం గువాహటిలో పెద్ద ఎత్తున గంభీర్‌కు వ్యతిరేకంగా నినాదాలతో మైదానం హోరెత్తింది.
మరోవైపు సీనియర్లు గంభీర్, రోహిత్ లు కూడా గంభీర్ పట్ల అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఐపీఎల్ అనంతరం వీళ్లిద్దరూ ఒక దశలో ఇంగ్లాండ్ పర్యటన కోసం సన్నద్ధమవుతూ కనిపించారు. కానీ హఠాత్తుగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పట్నుంచే ఇద్దరికీ గంభీర్‌తో సంబంధాలు దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ దాని గురించి ఒక చోట మాట్లాడుతూ..ఆ జట్టును రాహుల్ ద్రావిడ్ తయారు చేశాడని చెప్పాడు. అయితే అప్పటికే కోచ్ గా గంభీర్ ఉన్నాడు. ఇక రాంచి వన్డేలో సెంచరీతో జట్టును గెలిపించిన అనంతరం పెవిలియన్‌కు వచ్చాక, మ్యాచ్ అనంతరం గంభీర్‌తో అంటీముట్టనట్లుకోహ్లివ్యవహరించాడంటూ మీడియా చూపించింది. దాంతో పాటూ కోచ్ గంభీర్, అగార్కర్ కు వ్యతిరేకంగా కోహ్లీ మాట్లాడినట్టు కూడా కనిపిస్తోంది.
సయోధ్య కోసమే..
రోహిత్, కోహ్లీలో 2027 వరల్డ్ కప్ ను ఆడాలని బలంగా ఉన్నారు. కానీ కానీ జట్టు యాజమాన్యం నుంచి వీరికి ఈ విషయంలో హామీ మాత్రం దక్కడం లేదు. గంభీర్ కూడా వారిద్దరూ ఆడరేమోఅన్నట్టు మాట్లాడాడు. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించడం వెనుక ఉద్దేశం అదేనని చెబుతున్నారు. కానీ రో-కో లు మాత్రం అటు ఆస్ట్రేలియా, ఇటు సౌత్ ఆఫ్రికా సీరీస్ లలో దంచి కొట్టారు. మరోవైపు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత జట్టు వైట్‌వాష్‌కు గురి కావడంతో గంభీర్ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. ఇలాంటి టైమ్ లో సీనియర్ ఆటగాళ్ళు, కోచ్ కు మధ్య అంతరం అంత పెరగడం మంచిది కాదని బీసీసీఐ భావిస్తోంది. ఇది జట్టు వాతావరణానికే మంచిది కాదు. అందుకే గౌతీకి, రో-కోకు మధ్య అంతరాన్ని తొలగించేందుకే బీసీసీఐ సయోధ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో వరల్డ్ కప్ గురించి రోహిత్, కోహ్లీ ప్రణాళికలు, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో తెలియజేయడం ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం అనిచెబుతున్నప్పటికీ...ముఖ్యంగా గంభీర్, రోహిత్, కోహ్లీల మధ్య సయోధ్య కుదర్చడమే ముఖ్య విషయం అని చెబుతున్నారు.
Follow Us