/rtv/media/media_files/2025/08/28/sensation-in-politics-2025-08-28-21-12-20.jpg)
KTR vs Bandi Sanjay
రాజకీయాల్లో వారిద్దరూ ఉప్పునిప్పులా ఉంటారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుంటారు. అలాంటిది వారిద్దరూ ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని అందరూ అనుకుంటారు. ఇద్దరు ఎదురుపడితే ఇక ప్రళయమే అని పార్టీల కార్యకర్తలు చెవులు కొరుక్కుంటారు. కానీ, రాజకీయాల వరకే విమర్శలు, ఆరోపణలు అని వ్యక్తిగతంగా అలాంటివేం ఉండవని మరోసారి రుజువైంది. ఇద్దరూ ప్రత్యర్థులైనా వారి మధ్య నవ్వుల, పువ్వులు పూస్తాయని వెల్లడైంది.
Also Read: కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితి ఘోరం VIDEO.. ఈరోజు మరో 2 జిల్లాల్లో డేంజర్
KTR vs Bandi Sanjay Confront Each Other
భారీ వర్షాలకు తెలంగాణ(Heavy Rains In Telangana) వ్యాప్తంగా అనేక జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో సిరిసిల్ల(rajanna-sirisilla) లో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) పరిశీలించారు. అనంతరం ఆయన నర్మాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) నర్మాల నుంచి బయలు దేరారు. ఈ సందర్భంగా నేతలు ఒకరినొకరు పలకరించుకున్నారు. బండి సంజయ్‌కు కేటీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పరస్పరం అభివందనం చేసుకున్నారు కేటీఆర్, బండి సంజయ్. వరదల కారణంగా సిరిసిల్ల నియోజకవర్గం అతలాకుతలం అయింది. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలను పరామర్శించి.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గ ఎంపీ బండి సంజయ్ కావడం.. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉండటంతో ఆర్మీ హెలికాఫ్టర్లను కూడా పిలిపించి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.
Also Read : నర్సాపూర్ ట్రైన్‌లో భారీ దొంగతనం.. 68 గ్రాముల బంగారం చోరీ చేసిన దుండగులు!
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా నియోజకవర్గ పరిస్థితిని పరిశీలించేందుకు సిరిసిల్ల వెళ్లారు. అక్కడ వాగులో చిక్కుకున్న వారిని బండి హెలికాఫ్టర్ల ద్వారా రక్షించారు. ఆ తర్వాత వారు వెళ్లిపోయే ముందు ఎదురెదురుగా వచ్చారు. ఇద్దరూ కలవరేమో అని అందరూ అనుకున్నారు. కానీ.. కారుకు అటు వైపు వెళ్తున్న కేటీఆర్.. ఇటు వైపున ఉన్న బండి సంజయ్ ను చూసి ప్రత్యేకంగా వచ్చి కలిశారు. కరచాలనం చేశారు. ఇద్దరూ కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. కాగా ఈ సందర్భంగా బాగా కష్టపడుతున్నారని బండి సంజయ్ ను కేటీఆర్ ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. నర్మాల గ్రామస్తుల ప్రాణాలను కాపాడానిక బండి సంజయ్ హెలికాప్టర్‌ను పిలిపించడంలో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు.