Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో లాభాలు రావాలంటే.. ఎన్ని యూనిట్లు ఎప్పుడు అమ్మాలంటే?

మ్యూచువల్ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో లాభాలు రావాలంటే ఫండ్ పనితీరును బట్టి యూనిట్లను విక్రయించాలి. అప్పుడే మీరు అనుకున్న మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

New Update
Mutual Funds

Mutual Funds

డబ్బులు సేవ్ చేసుకోవాలని కొందరు స్టాక్ మార్కెట్లు వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే వీటిలో డబ్బులు పెట్టుబడి పెడితే కొన్నిసార్లు లాభాలు రావచ్చు. మరికొన్ని సార్లు నష్టాలు రావచ్చు. అయితే ఎక్కువగా నష్టాలు రాకుండా లాభాలు రావాలని కొందరు మ్యూచుఫల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువగా నష్టాలు ఉంటాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఎన్ని అమ్మాలనే విషయం సరిగ్గా కొందరికి తెలియదు. మరి ఎప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ విక్రయిస్తే లాభాలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: నేటి నుంచే భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల బాంబు.. ఇబ్బందుల్లో ఈ రంగాలు!!

ఫండ్ తీరును బట్టి యూనిట్లు..

మ్యూచువల్ ఫండ్ నిర్వహణలో ఫండ్ మేనేజర్ ముఖ్య పాత్ర పోషిస్తారు. కొన్నిసార్లు ఫండ్ మేనేజర్ మారుతుంటారు. ఈ సమయంలో పెట్టుబడుదారులు దాని  పనితీరును ట్రాక్ చేయాలి. దీనివల్ల ఫండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇవి తగ్గే అవకాశం కూడా ఉంటాయి. ఎలాంటి పెరుగుదల లేదనిపిస్తే మాత్రం వెంటనే విక్రయించవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో తక్కువ లేదా ఎక్కువ పెట్టుబడి పెట్టినా కూడా ఎక్కువ ఇయర్స్ పెట్టుకోవాలి. మీరు పెట్టిన పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒకటి లేదా రెండు ఏళ్ల ముందు ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకు ఎఫ్‌డీ లేదా డెట్ ఫండ్లుకు మారాలి. దీనివల్ల మీ పెట్టుబడి వృథా కాదు. అలాగే మీకు అత్యవసర పరిస్థితులు వచ్చాయని అనుకుంటే మాత్రం వెంటనే ఉపసంహరించుకోవచ్చు. మీరు యూనిట్లను విక్రయించాలని అనుకుంటే మాత్రం పూర్తిగా ఈ వివరాలు తెలుసుకోవాలి. ఫండ్ తీరును బట్టి మీరు యూనిట్లను విక్రయించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Market Crash: స్టాక్ మార్కెట్ పై ఇంకా టారిఫ్ ల ఎఫెక్ట్..ఈరోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్

ఉదాహరణకు మీ చదువు లేదా ఆరోగ్యం కోసం అవసరం అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్‌ను మధ్యలోనే ఆపేయవచ్చు. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి లాభాలు రావాలంటే మాత్రం సుదీర్ఘ కాలంగా ఇన్వెస్ట్ చేయాలి. ఉదాహరణకు కొందరు ఏడాదికి లేదా రెండేళ్లకు ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా కాకుండా ఐదేళ్లు, పదేళ్లు ఇలా సుదీర్ఘ కాలంగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మ్యూచువల్ ఫండ్‌లో సిప్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తేనే లాభాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో మీకు వీలు కుదిరిన మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు