TG Crime: ప్రాణం తీసిన పేకాట.. పోలీసులు రావడంతో పారిపోతుండగా హార్ట్ ఎటాక్!
పేకాట ఒకరి ప్రాణం తీసింది. అయితే ఇది ఏదో గొడవ మూలంగా జరిగిన మృతి మాత్రం కాదు. పేకాట స్థావరపై పోలీసులు దాడి చేయడంతో భయంతో పారిపోతుండగా వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.