/rtv/media/media_files/2025/08/18/sabitha-indra-reddys-big-shock-high-court-notices-2025-08-18-15-32-59.jpg)
Sabitha Indra Reddy's big shock...High Court notices
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabitha-indra-reddy) కి హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నాటి గనులశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓఎంసీ కేసు లో A8, A9 నిందితులుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి , కృపానందంలను నిర్దోషులుగా ప్రకటిస్తూ మే 6న హైదరాబాద్ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈక్రమంలో ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సబితా ఇంద్రారెడ్డి, కృపానందాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి:రామంతపూర్ షాక్ ఘటనకు కారణం వాళ్లే.. ఘటనా స్థలంలో హైటెన్షన్!
TG High Court Gave Notice To Sabitha Indra Reddy
కాగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ కోర్టు గతంలోనే శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డితో పాటు మిగిలిన నలుగురికి ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. అలాగే, దోషులకు రూ.10వేలు చొప్పున జరిమానా కూడా విధించింది. అదే సమయంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకు కోర్టు రూ.2 లక్షలు జరిమానా విధించింది. అయితే ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, ఆ తీర్పును రద్దు చేయాలని కోరుతూ సీబీఐ (CBI) ఇటీవలే హైకోర్టులో అప్పీలు చేసి పిటిషన్ దాఖలు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలకు శిక్ష విధించాలంటూ సీబీఐ తన పిటిషన్‌లో వెల్లడించింది.
కాగా, అంతరగంగమ్మ కొండల్లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC)కి మైనింగ్ లీజులను కట్టబెట్టడానికి జరిగిన కుట్రలో కృపానందం, సబితల పాత్ర ఉందని అప్పీలులో సీబీఐ పేర్కొంది. అంతరగంగమ్మ కొండ వద్ద 68.5 హెక్టార్ల లీజులో వీరు కీలక పాత్ర పోషించి లీజులు మంజూరు చేయడంతో ఓఎంసీ అక్రమంగా 29.32 లక్షల టన్నుల ఖనిజాన్ని తరలించిందని తెలిపింది. లీజులకు సంబంధించి ఐబీఎం (IMB)తో పాటు పర్యావరణ అనుమతులు పొందాలంటూ అప్పటి కార్యదర్శి కృపానందం2005 నవంబరు 9న ఓఎంసీకి తాత్కాలిక లీజు మంజూరు చేశారని వెల్లడించారు. అందుకు మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి cకూడా ఆమోదం తెలిపారని అప్పీలులో పేర్కొన్నారు.
కాగా ఈ కేసు విచారణలో ఉండగానే విచారణ నుంచి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి తప్పుకున్నారు. నిందితుల్లో ఒకరి తరఫున గతంలో తాను వాదనలు వినిపించానని, అందువల్ల సీబీఐ అప్పీలుపై విచారణ చేపట్టలేనని ఆయన తెలిపారు. దీంతో మరో న్యాయమూర్తి సీబీఐ అప్పీల్‌పై ఇవాళ విచారణ చేపట్టనున్నారు. సీబీఐ తరఫున శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించగా.. హైకోర్టు సబితాఇంద్రారెడ్డితో పాటు కృపానందంను కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నలుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దనరెడ్డితో పాటు , ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌కు బెయిల్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి:బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకుంటున్నది బీజేపీనే : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు