Ramachandra Rao: అలాంటి వాళ్లు వెళ్లిపోండి.. సొంత పార్టీ నేతలకు బీజేపీ కొత్త చీఫ్ వార్నింగ్!

భారతీయ జనతా పార్టీ తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని తెలంగాణ ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావు శనివారం బాధ్యతల స్వీకరించారు. కిషన్‌రెడ్డి నుంచి రామచందర్‌రావు బాధ్యతలు తీసుకున్నారు.

New Update
BJP chef

భారతీయ జనతా పార్టీ తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని తెలంగాణ ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బిజెపికి మార్గదర్శకంగా ఉన్నారని ప్రశంసించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావు శనివారం బాధ్యతల స్వీకరించారు. కిషన్‌రెడ్డి నుంచి రామచందర్‌రావు బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు గొప్పగా ఉండడంతో పాటు సంతోషంగా ఉందన్నారు. 

Also Read :  మరోసారి యశోద ఆసుపత్రికి కేసీఆర్.. ఎందుకంటే ?

Also Read :  పొరపాటున కూడా ఈ 7 కూరగాయలు నూనెలో వేయించకండి.. ఎందుకంటే!

Telangana BJP Chief Ramachandra Rao

బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన పరోక్షంగా రాజాసింగ్‌ని ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది. గోషామహాల్ ఎమ్మెల్యే రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీని నమ్ముకున్నవారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని, అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. పార్టీ అభివృద్ధికి పని చేసిన వారందరికీ అవకాశాలు వస్తాయన్నారు. అంతకుముందు ఆయన చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కేంద్రం నుంచి వస్తున్న యూరియా రైతులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని ఆయన అన్నారు.

Also Read :  జర్రుంటే అందరూ చనిపోయేవారు.. విమానం టేకాఫ్‌కు ముందు కుప్పకూలిన పైలట్..

Also Read :  దివాలా తీసిన రకుల్ భర్త.. అసలేం జరిగిందో చెప్పిన జాకీ

bjp | hyderabad | ramachandra-rao-attapur | galla-ramachandra-rao | ramachandra rao bjp chief telangana | bjp telangana president ramachandra rao | telangana bjp chief ramachandra rao

Advertisment
Advertisment
తాజా కథనాలు