Big Breaking: సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని మళ్ళీ బెదిరింపు..ఇంట్లోకి దూరి మరీ..

సల్మాన్ ఖాన్ ను మరోసారి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి మరీ చంపేస్తామని అన్నారు. ముంబైలోని వర్లీ రవాణాశాఖ వాట్సాప్ నుంచి సల్మాన్ ఖాన్ కు ఈ బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి.

author-image
By Manogna alamuru
New Update
Salman Khan,

సల్మాన్ ఖాన్ ను మరోసారి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబైలోని వర్లీ రవాణాశాఖ వాట్సాప్ నుంచి కూడా సల్మాన్ ఖాన్ కు ఈ బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. ఇంట్లోకి చోరబడి చంపేస్తామని..కార్ లో బాంబును పెట్టి పేల్చేస్తామని మెసేజ్ చేశారు.  ఇవి ఎవరు చేశారు? ఇంట్లోకి ఎలా వచ్చారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.  ఈ మెసేజ్ ఆధారంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మెసేజ్ ఎవరు పంపించారు అన్న కోషంలో దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదేం మొదటిసారి కాదు..

సల్మాన్ ఖాన్ కు గతంలోనూ చాలాసార్లే హత్య బెదిరింపులు వచ్చాయి. అతనికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో శత్రుత్వం ఉంది. సల్యాన్ కృష్ణ జింకలను చంపిన దగ్గర నుంచి అతనిని చంపేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ చెబుతూనే ఉంది. లాస్ట్ ఇయర్  గ్యాంగ్‌స్టర్ షూటర్లు సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని బహిరంగంగానే కాల్చి చంపారు. అలాగే గత ఏడాది ఏప్రిల్‌లో, సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పై కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరు తమ గ్యాంగ్ వారేనని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించాడు కూడా.  ఆ తర్వాత సల్మాన్ ఖాన్, కుటుంబ సభ్యుల భద్రత కోసం అతని ఇంటికి సెక్యూరిటీని పెంచారు. సల్మాన్ స్వయంగా తన ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ వేయించుకున్నాడు.

today-latest-news-in-telugu | salman-khan | whats-app | message | death | threat

Also Read: Bengaluru: 3 రాష్ట్రాలు..700సీసీ కెమెరాలు..దొరికిన బెంగళూరు లైంగికవేధింపుల కేసు నిందితుడు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు