/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/metro-jpg.webp)
metro
హైదరాబాద్ మెట్రో రైలు.. నగర ప్రజల ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా దీనిలో ప్రయాణించిన వారు.. ఇప్పుడు రద్దీ కారణంగా కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కన్పిస్తున్న రద్దీకి భిన్నంగా.. గణాంకాలు మాత్రం ప్రయాణికుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు అధికారుల చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని మార్గాల్లో ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోవడం మెట్రో సంస్థను కలవరపెడుతోంది.
Number Of Passengers In Hyderabad Metro
గతేడాది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అయితే.. సెప్టెంబర్ నెల నుండి అంతా బోల్తా పడింది. ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఫిబ్రవరి వరకు ఇదే కంటిన్యూ అయ్యింది. ముఖ్యంగా ఎంజీబీఎస్ నుండి జేబీఎస్ వరకు ఉన్న మెట్రో కారిడార్‌లో ప్రయాణికుల సంఖ్య చాలా నిరాశజనకంగా ఉంది. ఈ మార్గంలో పూర్తి స్థాయి కనెక్టివిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అలాగే.. నగరంలోని ఐటీ ఉద్యోగులు ఇంకా పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రాకపోవడం.. చాలామంది ఇప్పటికీ ఇంటి నుంచే పనిచేస్తుండటం కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
Also Read: Pakistan-India-China: భారత్-పాక్ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!
సాధారణ సమయాల్లో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ.. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో.. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఈ రద్దీని తగ్గించడానికి లూప్ మెట్రోలను నడుపుతున్నప్పటికీ.. పరిస్థితి ఏమీ మారడం లేదు. దీంతో ఆ సమయంలో మెట్రోలో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు.
మెట్రో సంస్థ నష్టాల నుండి బయటపడాలంటే.. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన ప్రయాణికుల సంఖ్యను తప్పకుండా అధిగమించాల్సి ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 16.19 కోట్ల మంది ప్రయాణికులు మెట్రోలో రాకపోకలు చేసినట్లు తెలుస్తుంది. రోజువారీ సగటున ఇది 4.43 లక్షలుగా ఉంది. ఈ ఏడాది ప్రయాణికులు పెరిగితేనే మెట్రో సంస్థ నష్టాల నుండి బయటపడే అవకాశలు కనపడుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు సంస్థ టర్మినల్ స్టేషన్ల నుంచి లాస్ట్ ట్రైన్ సమయాన్ని రాత్రి 11.45 గంటల వరకు పొడిగించారు. దీనివల్ల మరింత మంది ప్రయాణికులు మెట్రోను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నారు.
Also Read: Ap Weather Report: ఏపీలోని ఈ జిల్లాల్లో మరోసారి వర్షాలు..
Also Read: Trump-India-Pak: బాధ్యతాయుతంగా పరిష్కరించుకోండి..అమెరికా !
metro | hyderabad | l-and-t | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates