Latest News In Telugu Modi To telangana: తెలంగాణకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే? ఢిల్లీ పెద్దలు వరుసగా తెలంగాణ బాట పడుతున్నారు. రెండు జాతీయ పార్టీల(కాంగ్రెస్, బీజేపీ)కు చెందిన టాప్ లీడర్లు వరుస పెట్టి తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో బడా నేతల చూపు తెలంగాణపై పడింది. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. నిజామాబాద్లో మోదీ రోడ్ షో ఉండే అవకాశముంది. By Trinath 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం.. అక్కని చంపిన తమ్ముడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండలో మహిళా దారుణ హత్య జరిగింది. ఆటో కొనుగోలు లెక్కలలో తేడా వచ్చిందని అక్కను చంప్పాడు ఓ తమ్ముడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కోపంతో అక్కను మేకలు కోసే కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. By Vijaya Nimma 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DS Health update: అత్యంత విషమంగా డీఎస్ ఆరోగ్య పరిస్థితి.. ఇంటెన్సివ్ కేర్లో చికిత్స..! మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు డీఎస్. గతంలో పీసీసీ చీఫ్గా పనిచేశారు డీఎస్. కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు డీఎస్. తఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్న ఆయనకు.. సెప్టెక్ షాక్తో పాటు మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సీవ్ కేర్లో చికిత్స పొందుతున్నారు. By Trinath 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nizamabad: గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలపై పోలీసుల ప్రత్యేక దృష్టి బోధన్ పట్టణంలోని ఆదివారం గణేష్ ఉత్సవ నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DCP S.జై రామ్, విశిష్ఠ అతిథిగా ఇంచార్జ్ ఏసీపీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ శాంతి యుతంగా జరుపుకోని.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. By Vijaya Nimma 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharmapuri Arvind: వారి మొహాలకు పరేడ్ గ్రౌండ్ అవసరమా.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు బీజేపీకి అసెంబ్లీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తమ పార్టీకి అభ్యర్థులు లేరు అనే వారు గుడ్డి వారన్నారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nizamabad district: చిక్కిన చిరుత.. ఈ సారి ఎక్కడంటే.! ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం అధికమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల పరిధిలోని యంచ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చిరుతును బంధించేందుకు రంగంలోకి దిగారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Ragunandan Rao: వాళ్లను బొంద పెడతాం.. ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్.. బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హిందువులను బొందుగాళ్లన్న వారిని ఇందూరులో బొంద పెడతామని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం తెలియని మంత్రులు దేశంలో ఉండటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. By Shiva.K 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ Shabbir Ali: కేసీఆర్ కామారెడ్డికి రాకముందే దోపిడీకి పాల్పడ్డాడు సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టక ముందే దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే గంపా గోవర్డన్ను సీఎం కోట్ల రూపాయల ప్రజాధనం ఇచ్చారని ఆరోపించారు. By Karthik 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ Kamareddy Marriage Incident: కాసేపట్లో పెళ్లి..ఈలోపే చెట్టుకు వేలాడుతూ.. పెళ్ళి భాజాలు మోగాల్సిన ఇంట.. చావు డప్పు మోగాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గ్రామంలో జరిగిన ఈ ఘటన పెళ్ళింట విషాదాన్ని నింపింది.కాసేపట్లో పెళ్లనగా శవమై కనిపించాడు వరుడు.ఎల్లారం అటవీప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నట్లుగా తెలుస్తోంది. కుళ్లిన స్థితిలో పెళ్లికొడుకు మృతదేహం లభ్యమవ్వడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పెండ్లి శుభలేఖలు పంచి వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోయిన వరుడు సరిగ్గా పెండ్లి రోజే శవమై తేలాడు. By Jyoshna Sappogula 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn