Ravi Prakash : జహీరాబాద్.. 2009లో ఏర్పాటైన జహీరాబాద్(Zaheerabad) లోక్‌సభ సీటు భిన్నమైన సాంస్కృతిక నేపథ్యం కలిగిన జిల్లా. వెనుకబడిన ప్రాంతాలుగా పేరున్న నారాయణ్‌ఖేడ్, ఆందోల్, జుక్కల్ వంటి ప్రాంతాలున్న నియోజకవర్గం. మహారాష్ట్ర కల్చర్(Maharashtra Culture) తోపాటు భిన్నమైన వెనుకబడిన జాతుల కలయిక ఈ నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్ దిగ్గజనేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) ప్రాతినిధ్యం వహించిన పాత మెదక్ నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలిపుడు జహీరాబాద్ లోక్‌సభ సీటు పరిధిలో వున్నాయి.
2019లో బీఆర్ఎస్ అభ్యర్ధి బి.బి.పాటిల్ గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మదన్మోహన్రావు రెండో స్థానానికి పరిమితం అయ్యారు.
Telangana Game Changer : జహీరాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి బి.బి.పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: