Telangana: దారుణం.. బాలింత కడుపులో బ్యాండేజీ

హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో దారుణం జరిగింది. సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ బాలింత కడుపులో బ్యాండేజి ఉంచి కుట్లు వేసేశారు. ఇంటికొచ్చాక రెండ్రోజులకు ఆమె నొప్పి ఎక్కువైంది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్యాండేజీ తీశారు.

New Update
Doctors

Doctors Negligence

హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో దారుణం జరిగింది. సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ బాలింత కడుపులో బ్యాండేజి ఉంచి కుట్లు వేసేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కమలాపూర్‌ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన గర్భిణి వాణరాసి తిరుమలకు ఏప్రిల్‌ 27న నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ప్రసవం కోసం కమలాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. 

Also Read: ‘‘నువ్వు నాతో పడుకుంటే.. నేను మీ చెల్లితో కాపురం చేస్తా’’.. మరిది అరాచకం

Negligence Of Medical Staff

ఆస్పత్రిలో ఆమె సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏప్రిల్ 30న ఆమె డిశ్చార్జి అయ్యింది. అయితే ఇంటికొచ్చాక రెండ్రోజుల తర్వాత బాలింతకు కడుపు నొప్పి వచ్చింది. ఆదివారం ఆ నొప్పి ఇంకా ఎక్కువయ్యింది. సీజేరియన్ చేసి కుట్లు వేసిన చోటే ఎరుపు రంగు బ్యాండేజీ కనిపించింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. 

Also Read: నా తండ్రితో పడుకో.. లేదంటే! భార్య నగ్నవీడియోలు తీసి భర్త వేధింపులు!

ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు కుట్లు వేసిన ప్రాంతంలో బ్యాండేజీ ఉండిపోయినట్లు గుర్తించింది. ఆ బ్యాండేజీని బయటకు తీస్తుండగా.. రెండు కుట్లు తెగిపోయాయి. దీంతో రక్తస్రావం కాకుండా వైద్యులు చికిత్స చేశారు. బాలింత, బంధువులు, కుటుంబ సభ్యులు విధుల్లో ఉన్న వైద్యులతో గొడవకు దిగారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

Also Read: భారత్‌కు కోహినూర్‌ వజ్రం.. బ్రిటన్ మంత్రి కీలక ప్రకటన

Also Read :  సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

 

today-news-in-telugu | latest-telugu-news | latest telangana news | telugu-news | rtv-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు