/rtv/media/media_files/2025/05/04/0j047BhAzaHi3gbB4sOY.jpg)
British minister Responds about UK returning Kohinoor diamond to India
భారత్‌కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ మహారాణి కిరిటంలో పొదివి ఉన్న సంగతి తెలిసిందే. ఆ వజ్రం తిరిగి భారత్‌కు రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే తాజాగా బ్రిటన్ సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి లీసా నాండీ కీలక ప్రకటన చేశారు. కొహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేస్తారా అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. ప్రస్తుతం భారత్, బ్రిటన్ మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. అన్నీ సానుకూలంగా జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావొచ్చని తెలిపారు.
Also Read: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలతో దాడి !.. పుతిన్ కీలక ప్రకటన
ఈ విషయంపై భారత్ సాంస్కృతిక శాఖ మంత్రితో చర్చించానని తెలిపారు. అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం లీసా నాండీ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సాంస్కృతిక, సృజనాత్మకత, క్రీడా రంగాల్లో భారత్‌లో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే సాంస్కృతిక శాఖకు సంబంధించిన పలు ఒప్పందాల గురించి కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో చర్చలు జరుపుతున్నారు.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
పహల్గాం ఉగ్రదాడిపై కూడా ఆమె స్పందించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా భారత్‌కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో మహారాజ్ దులీప్‌సింగ్ విక్టోరియా మహారాణికి ఇచ్చారు. దీంతో ఆ వజ్రం అప్పటి నుంచి బ్రిటన్ వాళ్ల ఆధినంలోనే ఉంది. దాన్ని రాణి కిరీటంలోకి అమర్చారు. గతంలో భారత్ దాన్ని తిరిగి పొందేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు.
Also Read: పాక్ కు భారత సైనిక సమాచారం లీక్...ఇద్దరు ఇంటి దొంగల అరెస్ట్
Also Read: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)
rtv-news | national-news