ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే భార్య పాలిట కాలయముడయ్యాడు. భార్య అక్కను ట్రాప్ చేసి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె ఎన్ని సార్లు వద్దన్నా.. అతడు వినిపించుకోలేదు. ‘‘నువ్వు నాతో ప*డుకుంటే.. నేను మీ చెల్లితో కాపురం చేస్తా’’ అంటూ ఆమెను ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ వ్యవహారం గత 3 ఏళ్లుగా నడిచింది. ఈ విషయం ఆ కామాంధుడి భార్యకు కూడా తెలుసు. కానీ ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఆ కామాంధుడి అరాచకానికి భార్య బలైపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
వదిన కోసం భార్యను చంపిన భర్త
అనిల్ కుమార్ అనే వ్యక్తి డీజీపీ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అతడికి సాహితి అనే భార్య ఉంది. ఇద్దరూ హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ లో నివాసముంటున్నారు. కొంతకాలం హ్యాపీగానే జీవించారు. కానీ అనిల్ కుమార్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అతడు తన భార్య సాహితి అక్క స్వాతిపై కన్నేశాడు. అప్పటికే స్వాతి తన భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తుంది. దీంతో స్వాతిని ఎలాగైనా తనవశం చేసుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
దీంతో అతడు అనుకున్న విధంగానే స్వాతిని తన మాయలోకి దించి ఆమెతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్ లోనే ఉంటూ స్వాతితో దాదాపు మూడేళ్లుగా సహజీవనం చేశాడు. ఈ విషయం భార్య సాహితికి తెలియడంతో గత కొన్నేళ్లుగా రేగుల సాహితికి భర్త అనిల్ కుమార్ కు మధ్య కాపురంలో కలహాలు జరిగేవి. సొంత అక్కతోనే భర్త సహజీవనం చేస్తూ ఉండటంతో తరచూ భర్త అనిల్ తో వాగ్వాదానికి దిగేది భార్య సాహితి.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
స్వాతి సైతం తనను వదిలేయాలంటూ అనిల్ కుమార్‌ను వేడుకునేది. కానీ స్వాతితో శారీరక సుఖం కోసం అనిల్ కుమార్ బరితెగించాడు. తనతో సహజీవనం చేస్తేనే.. చెల్లి సాహితితో కాపురం చేస్తానంటూ స్వాతిని బెదిరిస్తూ కొంతకాలంగా సహజీవనం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే సాహితి హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఉదయం సాహితి కుటుంబ సభ్యులకు అనిల్ ఫోన్ చేశాడు. తన భార్య సాహితి గుండెపోటుతో మరణించిందంటూ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా తెలిపాడు.
దీంతో అంత్యక్రియల కోసం సాహితి మృతదేహాన్ని స్వస్థలం ఖమ్మంకు తీసుకొచ్చారు. అయితే మృతదేహంపై గాయాలుండటంతో మృతురాలు సాహితి తల్లిదండ్రులు అనుమానంతో ఖమ్మం టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. తమ అల్లుడు అనిల్ కుమార్ తీవ్రంగా కొట్టి తమ కుమార్తెను చంపాడంటూ సాహితి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాహితి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
khammam-crime | khammam crime today | Khammam crime news | khammam crime latest | latest-telugu-news | telugu-news