/rtv/media/media_files/2025/10/06/this-week-ott-releases-2025-10-06-10-29-16.jpg)
This Week OTT Releases
మరో వారం వచ్చేసింది. ఈ వారం థియేటర్(this-week-releasing-movies), ఓటీటీ(this-week-ott-movies)లో చిత్రాల కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత నెల చివరిలో వచ్చిన ‘ఓజీ’, అలాగే ఈ నెల మొదట్లో రిలీజ్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ చిత్రాలు ఎంతటి భారీ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వారంలో వినోదాలు పంచేందుకు పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Also Read : లిరిక్స్‌తో ఆకట్టుకున్న ఏమి మాయ ప్రేమలోన సాంగ్.. ప్రేక్షకులను మాయలోకి దించుతున్న మ్యూజిక్
థియేటర్ మూవీలు
అరి:సాయికుమార్ (Saikumar), అనసూయ (Anasuya), వినోద్‌వర్మ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
శశివదనే: సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘శశివదనే’. ఇందులో రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ కలిసి జంటగా నటించారు. ఈ చిత్రం గోదావరి నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీతో రానుంది. ఈ మూవీ కూడా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.
కానిస్టేబుల్: ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో ఓ ఊపు ఊపేసిన వరుణ్ సందేశ్.. ఈ సారి సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ‘కానిస్టేబుల్’ మూవీతో వస్తున్నాడు. ఇందులో మధులిక వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది.
Also Read : ‘ఓజీ’ ప్రీక్వెల్‌లో అకీరా?.. డైరెక్టర్ సుజీత్ ఫుల్ క్లారిటీ
ఓటీటీ మూవీస్/సిరీస్
జియో హాట్‌స్టార్
అక్టోబరు 10 - మిరాయ్
అక్టోబరు 10- సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (సిరీస్)
నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 6 - డా.సెస్సూస్ హార్టన్
అక్టోబర్ 6 - ట్రూ హాంటింగ్
అక్టోబర్ 8 - ఈజ్ ఇట్ కేక్ ? హాలోవీన్
అక్టోబర్ 8 - ది రిసరెక్టెడ్
అక్టోబరు 9 - వార్ 2 (అధికారిక ప్రకటన వెలువడలేదు)
అక్టోబరు 10 - స్విమ్ టు మీ
అక్టోబరు 10 - ది విమెన్ ఇన్ క్యాబిన్ 10
అక్టోబరు 10 - కురుక్షేత్ర (యానిమేషన్ సిరీస్)
అమెజాన్ ప్రైమ్ వీడియో
అక్టోబరు 8 - మెయింటెనెన్స్ రిక్వైర్డ్
సన్‌నెక్స్ట్
అక్టోబరు 10 - త్రిబాణధారి బార్బరిక్
జీ 5
అక్టోబరు 10 - స్థల్
అక్టోబర్ 10 - వెడువాన్
‘కూలీ’ ఫేమ్ కన్నా రవి హీరోగా నటించిన కొత్త సిరీస్ ‘వెడువాన్’. ఈ సిరీస్ ప్రేమ, మోసం, వంటి భావోద్వేగ సన్నివేశాలను కలిగి ఉంది.