BIG Breaking : కేటీఆర్ పై కేసు నమోదు!
కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది. పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.
కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది. పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ హైవేపై నీళ్ల ట్యాంకర్ లారీని ఇనోవా కారు ఢీ కొట్టినది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా మిర్యాల మాజీ సర్పంచ్ మర్డర్ కేసులో భయంకర నిజాలు బయటపడ్డాయి. రాజకీయ ఆధిపత్యం కోసమే ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు, వారి పిల్లలు కలిసి చక్రయ్యను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు.
తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. హోంమంత్రి పదవి తనకు ఇష్టమన్నారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరారు.
కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో 10th క్లాస్ గణితం పేపర్ వాట్సాప్‌లో లీక్ అయింది. స్కూల్లోని వాటర్ బాయ్ వివేకానంద స్కూల్లోని విఘ్నేశ్వరరెడ్డికి పంపినట్టు అధికారులు గుర్తించారు. దీంతో పలువురిని సస్పెండ్ చేశారు.
శాసనసభ నుంచి సస్పెన్షన్ కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ వద్ద రచ్చ చేశారు. అసెంబ్లీకి రావొద్దని సూచించిన చీఫ్ మార్షల్ కరుణాకర్ తో వాగ్వాదానికి దిగారు. తనను అసెంబ్లీకి రావొద్దని స్పీకర్ ఇచ్చిన బులిటెన్ చూపించాలని డిమాండ్ చేశారు.
నల్గొండ: వేములపల్లి మండలం శెట్టిపాలెంకి చెందిన వ్యక్తి నెమలి మాంసం అమ్మడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. చికెన్ తో బర్డ్ ఫ్లూ వస్తుందని జనాలు భయపడుతుండగా.. దీన్ని ఆసరాగా చేసుకుని నెమలి మాంసాన్ని అమ్మేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నల్గొండ నకిరేకల్‌లో 10వ తరగతి పేపర్ లీక్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు పరీక్ష మొదలైన వెంటనే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందనే ఎంఈవో ఫిర్యాదుపై 11 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.