BIG Breaking : కేటీఆర్ పై కేసు నమోదు!

కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది.  పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.

New Update
KTR

KTR

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది. టెన్త్ క్లాస్ పరీక్షల్లో మాస్ కాపింగ్ నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారంటూ, బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత, శ్రీనివాస్... కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.  దీంతో పలు సెక్షన్ల కింద కేటీఆర్ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.  కాగా పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.  

Advertisment
తాజా కథనాలు