Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!

నల్గొండ జిల్లా పంటపొలంలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. బొత్తలపాలెం వద్ద ఓ రైతు పొలంలో రూ.500 నోట్లతో కూడిన 50 కట్టలు దర్శమిచ్చాయి. పోలీసులకు సమాచారం అందించగా వాటిని పరిశీలించిన సీఐ వీరబాబు ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ నకిలీ నోట్లుగా తెలిపారు. 

New Update
fake notes

Nalgonda fake notes bundles in Farm land

తెలంగాణ (Telangana) లో మరోసారి నకిలీ నోట్ల (Fake Notes) కట్టలు కలకలం రేపాయి. నల్గొండ జిల్లాల్లోని పంట పొలాల్లో రూ.500 నోట్ల కట్టలు దర్శనమివ్వడంతో రైతులు ఉలిక్కిపడ్డారు. ఆ కంగారులలో వాటన్నింటిని ఇంటికి తీసుకెళ్లి దాచుకోగా మరికొందరు ఈ విషయాన్ని పోలీసులకు అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరకుని పరీశీలించగా అవి నకిలీనోట్లు అని తేల్చడంతో అంతా అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read :   తెలంగాణ లాసెట్ 2025 షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే

రూ.500 నోట్లతో కూడిన 50 కట్టలు..

ఈ మేరకు సోమవారం నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిలో బొత్తలపాలెం వద్ద ఓ రైతు పొలంలో రూ.500 నోట్లతో కూడిన 50 కట్టలు కనిపించాయి. ఆ పక్కనే సంచి కూడా ఉండటంటో స్థానిక రైతులు అందులోనుంచి కొన్నింటిని ఇంటికి తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి: Hyderabad: టాప్‌-10లో హైదరాబాద్‌ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక పర్యాటకుల సందర్శనతో రికార్డు!

అయితే మరికొంతమంది ఈ విషయం పోలీసుల చెప్పడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఆ నోట్లపై ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ముద్రించి ఉండగా నకిలీ నోట్లు అని తెలిపారు. అయితే భారీ స్థాయిలో నోట్ల కట్టలు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: శివాలయానికి వెళ్తుండగా ఏనుగుల గుంపు దాడి.. నలుగురు మృతి

ఇదిలా ఉంటే

అస్సాంకు చెందిన రాజకీయనేత బెంజమిన్ బాసుమతరీ కరెన్నీ నోట్లపై నిద్రిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచంమీద ఐదువందల నోట్లు చెల్లాచెదురుగా వేసి వాటి మధ్య పడుకున్నాడు. ఈ ఫొటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Also Read :  ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. పోలీసులకు లొంగిపోయిన యువకుడు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు