Nagarjuna and CM Revanth : రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున.. వివాదం సద్దుమణిగినట్టేనా?

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అగ్ర కథానాయకుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్‌ వివాహ వేడుకకు ఆహ్వానించారు. ఇద్దరి మధ్య విభేధాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో వారిద్దరూ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

New Update
Nagarjuna meets Revanth Reddy..

Nagarjuna meets Revanth Reddy..

Nagarjuna and CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అగ్ర కథానాయకుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్‌ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అలాగే ఆయనతో కాసేపు చర్చించారు. గతేడాది నవంబర్‌లో అక్కినేని అఖిల్‌ నిశ్చితార్థం జైనబ్‌ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అధికారికంగా వివాహ తేదీ వెల్లడించనప్పటికీ.. జూన్‌ 6న ఈ వేడుక జరగనున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే.. అఖిల్, జైనాబ్ ర‌వ్జీలపెళ్లి అన్నపూర్ణ స్టూడియోలోనే సింపుల్‌గా జ‌ర‌గ‌బోతున్నట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జ‌రిగింది. అఖిల్ పెళ్లి తేదీపై అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  

Also Read:Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హడ్రా పేరుతో ఆక్రమణలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హల్ ను హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే. N కన్వెన్షన్ హాల్. హైదరాబాద్ లో చాలా ఫేమస్. ఎంతో మంది ప్రముఖుల పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ ఇందులోనే జరిగేవి. అంతెందుకు సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్లి కూడా గతం లో ఇక్కడే జరిగింది.  హైడ్రా సంస్థ ఒక్క గంటలో నేలమట్టం చేసేసింది.ఈ క్రమంలో నాగార్జున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తన కుమారుడి పెళ్ళికి ఆహ్వానించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత సందర్భంగా నాగార్జున కోర్టుకు వెళ్లినప్పటికీ కూల్చివేతలు కొనసాగాయి. ఈ విషయంలో ఇద్దరిమధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు ప్రచారం సాగింది. 

Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాగార్జున, అమల దంపతులు  మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 30వ తేదీ శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి చేరుకున్న నాగార్జున దంపతులు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్‌..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?

ఇక ఆ తర్వాత రేవంత్‌ మంత్రివర్గంలో  మంత్రిగా ఉన్న కొండా సురేఖ నాగార్జున మాజీ కోడలు సమంత విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం అప్పట్లో పెనుసంచలనంగా మారింది. ఈ విషయంలో నాగార్జున కుటుంబం కోర్టులో సురేఖపై పరువునష్టం దావా కూడా వేశారు. ఆ తర్వాత కొండా సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ కేసు కొనసాగింది. అయితే ఆ తర్వాత ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి ఇరువురి మధ్య రాజీ కుదిర్చినట్లు ప్రచారం సాగింది. ఈ విషయంలోనూ నాగార్జున నేరుగా సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసినట్లు ఎక్కడ కనిపించలేదు. కానీ ఇటీవల మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొంటున్న వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందుకు నాగార్జున కూడా వెళ్లారు. ఆ సమయంలో  నాగార్జున రేవంత్ రెడ్డి తో చాలా సన్నిహితంగా మెలగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

తాజాగా వారి కొడుకు అఖిల్‌ వివాహానికి కూడా ఆహ్వానించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే రాజకీయాలు, సినిమాల్లో శాశ్కత శతృవులు శాశ్వత మితృలు ఉండరన్న సామెత ఉంది. సినిమా వారికి రాజకీయ అవసరం చాలా ఉంటుంది. కనుక వారితో పెట్టుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ నాగార్జున పాత విషాయలు అన్ని మరిచిపోయి ఆయనతో కలిసిపోయినట్లు కనిపిస్తోంది.

Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

Also Read :  BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే


Advertisment
Advertisment
తాజా కథనాలు