/rtv/media/media_files/2025/05/28/Vnm5Vx8HGkHaGaIM7d8R.jpg)
ఇద్దరిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఈరోజు కోర్టు శిక్ష విధించింది. సంయుక్త సాహు అనే మహిళ కాలేజ్ ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. అయితే అదే కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న పంజీలాల్ మెహర్‌కు ఆమెతో తగాదా ఉంది. కాలేజ్‌లో గొడవలు మనసులో పెట్టుకున్న మెహర్ సంయుక్త సాహు కొడుకు పెళ్లిలో పగతీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. దానికోసం పార్సల్ బాంబ్ ఇచ్చి పెళ్లి కొడుకుని చంపాయాలని నిర్ణయించుకున్నాడు.
Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
Marriage Gift Parcel Bomb
PATNAGARH PARCEL BOMB CASE: CRIME THAT SHOOK ODISHA
— Soumyajit Pattnaik (@soumyajitt) May 28, 2025
First known instance in India of a parcel bomb being used as a wedding gift
The crime shocked Odisha due to its premeditated and cold-blooded nature
Today Punjilal Meher was convicted & sentenced to life imprisonment… pic.twitter.com/KOkIN6OfPb
Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
మ్యారేజ్ గిఫ్టుగా పార్సిల్ బాంబును పంపించాడు. ఆ పార్సిల్ ఓపెన్ చేయగానే బాంబు పేలి పెళ్లికొడుకు సౌమ్య సాహు ప్రాణాలు కోల్పోయాడు. అతడితోపాటు అతడి నానమ్మ కూడా మృతిచెందింది. పెళ్లికుమార్తెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 2018 ఫిబ్రవరి 23న ఘటన జరుగగా అదే ఏడాది మార్చి 23న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 2018 ఏప్రిల్‌లో మెహర్‌ను అరెస్ట్ చేశారు. ఒడిశాలోని బొలాంగిర్ జిల్లా కోర్టు బుధవారం ప్రతాప్‌గఢ్ అడిషనల్ జిల్లా జడ్జి విచారణ జరిపారు. నిందితుడు పంజీలాల్ మెహర్‌ను దోషిగా తేల్చారు. అతడికి జీవితఖైదు విధించడంతోపాటు రూ.1.70 లక్షల జరిమానా విధించారు. పంజీలాల్ మెహర్ ప్రతాప్‌గఢ్ సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ విచారణ ఎదుర్కొన్నాడు.
Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ
Also Read : BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే
odisha | telugu crime news | parcel bomb wedding gift | court | latest-telugu-news