Mother killing two sons : మేడ్చల్​లో దారుణం.. ఇద్దరు కుమారులను కొడవలితో నరికి చంపి ఆ తర్వాత..

ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో? క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపింది. జీడిమెట్లలో నివసిస్తున్న ఓ మహిళ 7,5 ఏండ్ల వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా నరికి చంపింది. అనంతరం భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

New Update
suicide

Mother killing two sons, commits suicide

Mother killing two sons : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో? క్షణికావేశంతో  తన ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపింది. ఈ దారుణ సంఘటన మేడ్చల్‌ జిల్లా గాజుల రామారం లో చోటుచేసుకుంది. జీడిమెట్లలో నివసిస్తున్న ఓ మహిళ.. ఏడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా నరికి చంపింది.అనంతరం భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.


Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

పూర్తి వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలోని బాలాజీ లేఅవుట్లో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది తేజస్వీని రెడ్డి అనే మహిళ. అయితే.. ఏమైందో తెలియదు కానీ గురువారం (ఏప్రిల్ 17) ఉన్నట్టుండి ఇద్దరు పిల్లలు ఆశిష్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను వేట కొడవలితో దారుణంగా నరికి చంపింది. అనంతరం ఆమె బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

Also Read: TS: జపాన్ కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు..సీఎం రేవంత్ రెడ్డి

హుటాహుటిన వచ్చిన పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పిల్లలను వేట కొడవలితో అత్యంత కిరాతకంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది..? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలా లేకా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను హత్య చేసి తేజస్వీని ఆత్మహత్యకు పాల్పడటంతో అపార్ట్‎మెంట్ వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకేసారి ముగ్గురు మరణించడంతో తేజస్వీని ఫ్యామిలీతో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. కాగా,  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు