/rtv/media/media_files/2025/04/16/nSWFAsSrbhVBWPG5UhvO.jpg)
Jaat Collections
Jaat Collections: సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన "జాట్" సినిమా వీకెండ్‌కు బాక్సాఫీస్ వద్ద జోష్ పెంచింది. ఇండియా వైడ్ రూ.40 కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.49.3 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తొలిసారి టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన చిత్రం "జాట్", మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చేలా థియేటర్లలో సందడి చేస్తోంది. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి గోపీచంద్ మాస్ టేకింగ్ మిక్స్ కావడంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.
రిలీజ్ రోజు ప్రపంచవ్యాప్తంగా కొద్దిగ నెమ్మదిగా వసూళ్లు మొదలైనా, వీకెండ్‌కి బాక్సాఫీస్ వద్ద సినిమా వేగంగా పరుగులు పెట్టింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
ప్రపంచవ్యాప్తంగా రూ. 49.3 కోట్ల నెట్
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రూ. 40 కోట్ల మార్క్‌ను దాటి, ప్రపంచవ్యాప్తంగా రూ. 49.3 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమాకి సాలిడ్ వీకెండ్ ఓపెనింగ్ వచ్చిందని చెప్పొచ్చు.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా, రణదీప్ హూడా విలన్‌గా కనిపించారు. మరో విశేషం ఏమిటంటే – ఈ ప్రాజెక్ట్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి "జాట్" బాక్సాఫీస్ వద్ద మెల్లగా మొదలై, వారం చివరికి భారీ వసూళ్లతో హిట్ మూవీగా నిలిచింది.
Also Read: ‘కేజీఎఫ్ చాప్టర్-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!
#JAAT continues its blockbuster outing at the box office 💥💥#JAAT collects 65.45 CRORES+ DOMESTIC GBOC in 6 days ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 16, 2025
Book your tickets for the MASS FEAST now!
▶️ https://t.co/sQCbjZ5zOE
Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by… pic.twitter.com/UlQiLOyDFM