/rtv/media/media_files/2025/09/01/trump-2025-09-01-21-28-07.jpg)
Trump
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తాను విధించిన టారిఫ్ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సదస్సు(SCO)లో ప్రధాని మోదీ, అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నారు. ఈ భేటీ ముగిసిన కొన్న గంటలకే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. భారత్‌తో వాణిజ్యం చేయడం పూర్తిగా ఏకపక్ష విపత్తుగా అభివర్ణించారు. భారత్ తమపై అధిక సుంకాల విధించడం అమెరికా వస్తువులను విక్రయించలేకపోతోందని ఆరోపణలు చేశారు.
Also Read: ఆ వాహనాలకు రోడ్ ట్యాక్స్ ఉండదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
'' మేము భారత్‌తో చిన్నపాటి వ్యాపారం చేస్తామని కొందరు అనుకుంటారు. కానీ భారత్ మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే.. మాకు వాళ్లు పెద్ద సంఖ్యలో వస్తువులు అమ్ముతుంటారు. వారికి అతిపెద్ద క్లైయెంట్ మేమే. కానీ మేము మాత్రం వాళ్లకి చాలా తక్కువగా అమ్ముతున్నాం. గత దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. భారత్ ఏ దేశంపై కూడా విధించని అధిక టారిఫ్‌లు మాపై విధించింది. అందువల్ల మా వ్యాపారాలను భారతీయులకు అమ్మలేకపోతున్నాం. ఇది పూర్తిగా ఏకపక్ష విపత్తు. అంతేకాదు భారత్.. రష్యా నుంచే ఎక్కువగా చమురు, మిలిటరీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. అమెరికా నుంచి చాలా తక్కువ కొంటోంది. ఇప్పుడు భారత్ తమ టారిఫ్‌లు తగిస్తామని ఆఫర్ చేసింది. కానీ ఇది ఆలస్యమైంది. కొన్నేళ్లక్రితమే వాళ్లు చేయాల్సిందని'' ట్రంప్ రాసుకొచ్చారు.
Also Read: ట్రంప్ తిక్క కుదిరింది.. విదేశీ విద్యార్థులు రాకపోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం!
ఇదిలాఉండగా చైనాలోని తింజియన్ వేదికగా రెండు రోజుల పాటు షాంఘై సహకార సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి మోదీ, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో పుతిన్ ట్రంప్‌ను జోకర్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ సదస్సులో పుతిన్ ప్రస్తావించినప్పటికీ అసలు ట్రంప్ పేరే ఎత్తలేదు. యుద్ధం ఆపేందుకు భారత్, చైనా కృషి చేస్తున్నాయంటూ పొగిడారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చాలని పశ్చిమ దేశాలు ప్రయత్నాలు చేశాయని.. అందుకే ఈ సంక్షోభం తలెత్తినట్లు చెప్పుకొచ్చారు.