/rtv/media/media_files/2025/07/04/children-2025-07-04-07-01-13.jpg)
13 Percent children born premature, 17 Percent underweight in India: Report
భారత్‌లో 13 శాతం మంది చిన్నారులు నెలలు నిండక ముందే జన్మిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది. అలాగే 17 శాతం మంది చిన్నారులు తక్కువ బరువుతో పుడుతున్నట్లు పేర్కొంది. వాయు కాలుష్యమే ఇలాంటి పరిస్థితులుకు దారి తీస్తున్నట్లు తెలిపింది. గర్భిణులు వాయు కాలుష్యానికి గురైతే పుట్టబోయే పిల్లల్లో ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ ముంబయి, బ్రిటన్, ఐర్లాండ్‌లోని పలు ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన పరిశోధకులు ఈ సర్వే చేపట్టారు.
Also Read: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
2019-21 మధ్య భారత్‌లో జరిగిన కాన్పులను ఈ సర్వేలో పరిశీలించారు. గర్భిణులు పీఎం 2.5 ధూళికణాలను ఎక్కువగా పీలిస్తే పిల్లలు తక్కువ బరువుతో అవకాశాలు 40 శాతం ఉన్నట్లు తేలింది. ఇక నెలలు నిండక ముందే జన్మించే ముప్పు 70 శాతం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీ, పంజాబ్, హర్యాణా లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో పీఎం 2.5 ధూళికణాల కాలుష్యం ఎక్కువ స్థాయిలో ఉందని పేర్కొన్నారు.
13% children born premature, 17% underweight in India: Report pic.twitter.com/KWtje6UmZw
— The Tatva (@thetatvaindia) July 3, 2025
Also Read: యువతిపై స్ప్రే చల్లి రేప్.. మళ్లీ వస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన డెలివరీ బాయ్!
హిమాచల్‌ప్రదేశ్‌లో 39 శాతం, ఉత్తరాఖండ్ 27 శాతం, రాజస్థాన్ 18 శాతం, ఢిల్లీలో 17 శాతం నెలలు నిండక ముందే కాన్పులు జరిగాయని తెలిపారు. పంజాబ్‌లో చూసుకుంటే 22 శాతం పిల్లలు తక్కువ బరువుతో పుట్టినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, దాద్రానగర్ హవేలీ, మధ్యప్రదేశ్, హర్యాణా, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని స్పష్టం చేశారు.
Also Read: బీఆర్ఎస్ కు కవిత మరో సంచలన లేఖ.. కేసీఆర్ అందుకు ఒప్పుకుంటారా?