MLC Kavitha: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కవిత సవాల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత రేవత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ బీసీలకు అన్యాయమే జరిగిందని విమర్శించారు. అది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాని సవాల్ విసిరారు.

New Update
MLC Kavita

MLC Kavita

బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత బీసీ మహాసభలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. మండల్ కమిషన్‌ రిపోర్టును ఇప్పుడు బీరువాలో పెట్టారంటూ విమర్శించారు. మండల్ కమిషన్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు. 

Also Read:  ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఎప్పుడూ కూడా అన్యాయమే జరిగిందని మండిపడ్డారు. ఇది అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాని సవాల్ విసిరారు. '' దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా బీసీల వాస్తవ లెక్కలు బయటకు తీయాలి. కులం ఆధారంగా రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. బీసీల కోసం పనిచేసిన వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కూడా బీసీ సామాజిక వర్గానికి అన్యాయం చేశారు. రాజీవ్ గాంధీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని అన్నారు. 

Also Read: మహాకుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అప్‌డేట్.. ఐఎండీ కీలక ప్రకటన

2011 కులగణన చేసిన నివేదికను అప్పటి UPA ప్రభుత్వం బయటపెట్టలేదు. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా ఈ రిపోర్టును బయటపెట్టలేదు. తాము కులగణన చేయమని ఇప్పటికే బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేశాయి. ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు అండగా ఉన్నాయి. వారికి న్యాయం చేశారు. కేసీఆర్, ఎన్టీఆర్‌ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులే బీసీల వైపు నిలబడి న్యాయం చేశారని '' కవిత అన్నారు.  అలాగే మహాత్మా జ్యోతిబా ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. 

Also Read: ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్‌ రా బాబు!

Also Read: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్‌కు.. నెక్ట్స్‌ ఇండియాకు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు