సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత భూమి నుంచి ఆకాశం వరకు జరిగే వింతలన్నీ కళ్లముందే కనిపించేస్తున్నాయి. మారుమూల ప్రాంతంలో ఏది జరిగినా.. ఇట్టే వైరల్ అయిపోతుంది. అందులో ఎన్నో వింతలు, విశేషాలు, ఊహకందని పరిణామాలు, కళ్లుచెదిరే సంఘటనలు, ఓరి దేవుడా అనిపించే వీడియోలు ఇలా నెట్టింట తరచూ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్? తాజాగా అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి ఓరి దేవుడా.. ఇదేం ఘోరం అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరైతే ఏం జరుగుతుందా అని చూసి చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇలా ఆ వీడియో చూసినోళ్లంతా మొదట అయ్యో అయ్యో అనుకున్నారు. Also Read: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్ ఊహించని ఘటన ఆ తర్వాత హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. మరి ఆ వీడియోలో అంతలా ఏముందో మీరు కూడా చూసేయండి. ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో ఒక బస్సు స్పీడ్‌గా వచ్చింది. దీంతో అతడు కాస్త స్లో అయ్యాడు. వెంటనే ఆ బస్సును మరో బస్సు ఓవర్‌ట్రాక్ చేయబోయింది. దీంతో అతడు రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. Also Read: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్సర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్ తమిళనాడు - పట్టుకొట్టాయ్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలతో బైట పడ్డ వ్యక్తి. pic.twitter.com/rwUON3xnQk — greatandhra (@greatandhranews) January 3, 2025 Also Read: తెలంగాణ మంత్రుల వేలకోట్ల కుంభకోణం.. నా దగ్గర ప్రూఫ్స్: ఏలేటి సంచలనం వెంటనే రెండు బస్సులు కాస్త దూరం జరగడంతో అతడు కిందపడిపోయాడు. అయితే ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి చిన్న చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన తమిళనాడు - పట్టుకొట్టాయ్స్‌లో జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.