/rtv/media/media_files/2025/02/02/0NTZtD0Mde3EzlZ4B9JC.jpg)
Minor Girl Assaulted by
మొబైల్ ఫోన్లు చేతికి వచ్చి సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత వికృత చేష్టలు పెరిగి పోయాయి. మేజర్లు, మైనర్లు అనే తేడా లేకుండా ప్రేమ పేరుతో వంచించబడుతున్నారు. ప్రేమ పేరుతో బాలికలను ట్రాప్ చేసి వారిని వాడుకోవడం. ఆ తర్వాత వారు తీసుకున్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడం సర్వసాధారణమై పోయింది. ఆ బాలికలు కూడా తమ పరవు పోతుందన్న బాధతో వారు ఏది చెప్తే అది చేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఇన్ స్టా గ్రామ్‌లో పరిచయమై ప్రేమ పేరుతో వంచనకు గురైన ఒక మైనర్ బాలికి చివరికి సూసైడ్ చేసుకునేందుకు కూడా వెనుకాడలేదు. ఘట్ కేసర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
Minor Girl Blackmailed
ఘట్‌కేసర్‌కు చెందిన ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసాడు ఓ యువకుడు.. ఆ తర్వాత ఆమెను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి భారీగా బంగారం తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ మైనర్ బాలిక చెల్లిని కూడా తన వద్దకు పంపాలని ఒత్తిడి చేయడంతో ఆ మైనర్ బాలిక బలవన్మరణానికి ప్రయత్నించింది. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔషాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘట్ కేసరకు చెందిన బాలికకు అదే ప్రాంతానికి చెందిన అవినాష్ రెడ్డి అనే యువకుడు ఇన్ స్టా గ్రామ్‌లో పరిచయమయ్యాడు. అ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా అప్పుడప్పుడు వారిద్దరూ కలుసుకునేవారు. అలా కలుసుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత యువకుడు వికృత చేష్టలు మొదలు పెట్టాడు.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
మైనర్ బాలిక అయిన అక్కతో ప్రేమాయణం నడిపిన ఆ యువకుడి కన్ను ఆమె చెల్లెలిపై పడింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు చూపించి బాలికను బెదిరించాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. అలా బెదిరించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని రమ్మని బలవంతం చేశాడు. అలా చేస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని నమ్మించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాలిక ఇంట్లో నుంచి రహస్యంగా బంగారు ఆభరణాలు తీసుకుని వచ్చి అవినాష్ రెడ్డి చేతికి ఇచ్చింది. కానీ వాడు మాత్రం ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయలేదు. మరోమారు బ్లాక్ మెయిల్ మొదలు పెట్టాడు.
Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
ఈసారి ఏకంగా నీ చెల్లిని తీసుకుచ్చి అప్పగించాలంటూ బెదిరించాడు. ఒకవైపు నగలు పోయాయన్న బాధ, మరోవైపు చెల్లిని వాడికి అప్పగించాలన్న వేదనతో మైనర్ మానసిక వేదనకు గురైంది. ఇక చేసేది లేక చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే సమయానికి గుర్తించిన కుటుంబ సభ్యులు మైనర్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తండ్రి తిరుమల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
ghatkesar | minor girls incident | minor girl case | minor-girl | instagram