Minister Uttam Kumar: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి

NDSA కాళేశ్వరంపై ఇచ్చిన నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారే డిజైన్ చేశారు.. వారే కట్టారు.. వారు అధికారంలో ఉండగానే కూలిందని ఆ పార్టీపై ఆయన మండిపడ్డారు. ప్రాజక్ట్ నిర్మించినవాళ్లు రైతులకు ద్రోహం చేశారన్నారు.

New Update
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరంపై ఇచ్చిన నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారే డిజైన్ చేశారు.. వారే కట్టారు.. వారు అధికారంలో ఉండగానే కూలిందని బీఆర్ఎస్ పార్టీపై ఉత్తమ్ కుమార్‌ మండిపడ్డారు. కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్నప్పటికీ రికార్డ్ స్థాయిలో పంటలు పండాయని ఆయన అన్నారు. కాళేశ్వరం నిర్మించినవాళ్లు రైతులకు ద్రోహం చేశారని విమర్శించారు.

Also read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

Also Read :  NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి

Minister Uttam Kumar Says About BRS

అబద్ధాలు, తప్పులపై బతకాలని బీఆర్ఎస్ అనుకుంటోందని నీటిపారుదల శాఖ మంత్రి అన్నారు. NDSA రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తామని ఆయన వెల్లడించారు. వచ్చే కేబినెట్‌లో NDSA నివేదికపై చర్చించి చర్యలు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ఎవడి అయ్య జాగీరు అన్ని కట్టారని గత ప్రభుత్వాన్ని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. ఆ ప్రాజెక్ట్ రైతుల కోసం కాదు.. జేబులు నింపుకోడానికే కట్టారని అన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి.. లక్ష కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. రైతులకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి

Also Read :  'క' మూవీ మరో ఘనత .. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నామినేషన్

(kaleshwaram | kaleshwaram barrage | kaleshwaram case | minister-uttam-kumar-reddy | minister-uttam-kumar | latest-telugu-news)

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు