ధరణిలో మార్పులు, కొత్త ఆర్‌వోఆర్ చట్టం.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ధరణిలో పలు మార్పులు చేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2020 ఆర్‌వోఆర్ చట్టంలో ఉన్న లోపాలు సరిచేసి 2024 ఆర్‌వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదిస్తామన్నారు.
ధరణి పొర్టల్‌కు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టల్‌ను ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. '' మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణిలో పలు మార్పులు చేశాం. పోర్టల్ నిర్వహణను డిసెంబర్ 1 నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్‌సీబీకి మార్చేశాం. 2020 ఆర్‌వోఆర్ చట్టంలో ఉన్న లోపాలు సరిచేసి 2024 ఆర్‌వోఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం.
ఈ కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తాం. ధరణ కొత్త యాప్, అలాగ కొత్త ఆర్‌వోఆర్ చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసింది. కానీ రెవెన్యూ గ్రామాలకు కచ్చితంగా ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుతున్నారు. 2004 నుంచి 2014 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించింది. తెలంగాణ వచ్చాక 2014-23 మధ్య కాలంలో కేవలం 1.52 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మాత్రమే టెండర్లు పిలిచారు.
గత ప్రభుత్వం చేయని అభివృద్ధిని చేసి చూపించాం. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు దుష్ర్పచారం చేస్తున్నారు. ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోంది. ఫామ్‌హౌస్‌లో కూర్చొని కబుర్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో సర్వే వ్యవస్థను కూడా పటిష్ఠం చేస్తాం. ఇందుకోసం వెయ్యి సర్వేయర్ల పోస్టులను భర్తీ చేస్తామని''పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Also Read: సరిహద్దు భద్రత కోసం యాంటీ డ్రోన్ విభాగం : హోం మంత్రి అమిత్ షా
ఈ కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తాం. ధరణ కొత్త యాప్, అలాగ కొత్త ఆర్‌వోఆర్ చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసింది. కానీ రెవెన్యూ గ్రామాలకు కచ్చితంగా ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుతున్నారు. 2004 నుంచి 2014 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించింది. తెలంగాణ వచ్చాక 2014-23 మధ్య కాలంలో కేవలం 1.52 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మాత్రమే టెండర్లు పిలిచారు.
Also Read: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం
గత ప్రభుత్వం చేయని అభివృద్ధిని చేసి చూపించాం. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు దుష్ర్పచారం చేస్తున్నారు. ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోంది. ఫామ్‌హౌస్‌లో కూర్చొని కబుర్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో సర్వే వ్యవస్థను కూడా పటిష్ఠం చేస్తాం. ఇందుకోసం వెయ్యి సర్వేయర్ల పోస్టులను భర్తీ చేస్తామని''పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Also Read: ట్యాంక్ బండ్‌పై ఫైటర్ జెట్ల విన్యాసాలు.. ఇక్కడ చూడండి
Also Read: ఈ సీజన్‌లో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు మిస్ కావద్దు!