ఇండియా సరిహద్దుల్లో భద్రత పటిష్ఠం చేయడానికి యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటిచారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 60వ ఫౌండేషన్ పరేడ్‌లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో డ్రోన్‌ల దాడులుకలవరపెడుతున్నాయని మంత్రి చెప్పారు.
Also Read: డబ్బులు ఊరికేం రావు.. బ్యాంక్ మేనేజర్‌ని చితక్కొట్టిన కస్టమర్
రాబోయే రోజుల్లో డ్రోన్ల నుంచి ముప్పు మరింత పెరుగుతుందని, వాటి వల్ల తలెత్తే భద్రతా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు.
Also Read: ఈవీఎంలపై విపక్షాల అనుమానాలు.. స్పందించిన షిండే !
2023లో 110 డ్రోన్‌లు, 2024లో 260 కంటే ఎక్కువ డ్రోన్‌లు భద్రతా బలగాలు అడ్డుకున్నారని ఆయన అన్నారు. వీటిలో చాలా డ్రోన్‌లు అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించేవని అమిత్ షా చెప్పారు.
డ్రోన్ వార్‌ఫేర్ సమస్యను పరిష్కరించడానికి ఎయిర్, నావీ, ఆర్మీ దళాలతోపాటు పరిశోధన సంస్థలు, DRDOతో ప్రభుత్వ ప్రయత్నం కూడా అవసరమని ఆయన అన్నారు. బార్డర్ లో పెరుగుతున్న డ్రోన్ దాడులను అధిగమించేందుకు ప్రత్యేకంగా యాంటీ-డ్రోన్ యూనిట్ అతి త్వరలో ఏర్పాటు చేయబడుతుందన్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో భారతదేశం 6,300 కి.మీ పొడవైన సరిహద్దులను రక్షించే బాధ్యత BSFకి అప్పగించబడిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిష్ షా వివరించారు.
Also Read: ఈ సీజన్‌లో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు మిస్ కావద్దు!
Also Read: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం