ఈ సీజన్‌లో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు మిస్ కావద్దు!

వింటర్ సీజన్‌లో విహార యాత్రలకు ప్లాన్ చేస్తుంటే.. గుల్మార్గ్, డార్జిలింగ్, అరకు, లంబసింగి ప్లేస్‌లు అసలు మిస్ కావద్దు. తెల్లని మంచుతో కొండల మధ్య ఉండే ప్రకృతి చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను వింటర్ సీజన్‌లో తప్పకుండా చూడాల్సిందే.

New Update
IRCTC: ఒక్కరోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసే అద్భుతమైన ప్యాకేజీ

ట్రావెలింగ్ చేయాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా వింటర్ సీజన్‌లో అయితే కొన్ని ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. శీతాకాలంలో తెల్లని మంచుతో కొన్ని ప్రదేశాలు చూడటానికి అసలు రెండు కళ్లు కూడా చాలవు. అయితే వింటర్ సీజన్‌‌లో చూడటానికి మన ఇండియాలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో వింటర్ సీజన్‌లో అసలు మిస్ చేయకుండా సందర్శించాల్సిన ప్లేస్‌లు ఏవో మరి చూద్దాం.

ఇది కూడా చూడండి:  Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

గుల్మార్గ్

జమ్మూ కశ్మీర్‌లో గుల్మార్గ్ ఈ సీజన్‌లో చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వింటర్‌లో ఈ ప్లేస్‌కి వెళ్లడం చాలా కష్టం. కానీ లైఫ్‌లో ఒక్కసారైన ఈ సీజన్‌లో గుల్మార్గ్‌ను చూడాల్సిందే. తెల్లని మంచుతో కప్పబడి ఉన్న కొండలు ఆ అందాలు చూస్తే అక్కడి నుంచి తిరిగి రావాలని కూడా అనిపించదు. 

ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

డార్జిలింగ్

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ చాలా ఫేమస్. సాధారణంగానే డార్జిలింగ్ చూడటానికి కనులకు పండగా ఉంటుంది. అలాంటిది వింటర్ సీజన్‌లో ఈ ప్లేస్ చూస్తూ.. ప్రతీ ఏడాది డార్జింగ్ వెళ్లాలనే కోరిక కలుగుతుంది. 

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

అరకు

ఏపీలోని విశాఖపట్నంలో అరకు వ్యాలీ ఉంది. కొండల మధ్య ప్రయాణం, జలపాతాలు, అరకు అందాలు ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంది. వింటర్ సీజన్‌లో ఈ ప్లేస్ అసలు మిస్ కావద్దు.

లంబసింగి

ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న లంబసింగి కొండ ప్రాంతంలో ఉంటుంది. ఇది ప్రకృతి అందాలకు నిలయమని చెప్పవచ్చు. ఇక్కడ ఉదయం పూట మంచు ఎక్కువగా కురుస్తుంది. తెల్లని మంచు, ఆకాశం చూస్తే ఎంతో సుందరంగా ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు