Delhi: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం

హర్యాణా, పంజాబ్ రైతులు డిసెంబర్ 8 (ఆదివారం) ఛలో ఢిల్లీ ర్యాలీగా బయలుదేరారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. లాఠీ చార్జ్‌ చేశారు. బార్కెట్లను దాటడానికి వచ్చే రైతులను చెదరగొట్టారు.

author-image
By K Mohan
New Update
villl

దేశ రాజధాని ఢిల్లీలో మరో రాసి రైతులపై లాఠీఛార్జ్ జరిగింది. గత కొన్ని నెలలుగా హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీలో నిరసన తెలపడానికి ప్రయత్నిస్తు్న్నారు. ర్యాలీగా పార్లమెంట్ ఢిల్లీకి చేరుకొని తమ సమస్యలపై పోరాడదామనుకుంటున్నారు. అందుకోసం ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నిసార్లు నిరసనల కోసం ఢిల్లీకి వెళ్తామని బయలుదేరినా పోలీసు బలగాలు ఢిల్లీ సరిహద్దుల్లోనే వారిని అడ్డుకుంటున్నారు. తాజాగా 

రైతుల ఢిల్లీ చలో ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. లాఠీ చార్జ్‌ చేశారు. బార్కెట్లను దాటడానికి వచ్చే రైతులను చెదరగొట్టారు. రైతుల శాంతించిన తర్వాత పోలీసులు వారిపై పూలు చల్లారు.

ఇది కూడా చూడండి:  Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

 

నిరసన వ్యక్తం చేయడానికి రైతులు ముందుగానే అనుమతి పోలీసుల నుంచి తీసుకున్నామని అంటున్నారు.ముందు అనుమతి ఇచ్చి, ఇప్పుడు అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు.  ఢిల్లీ ఛలో ర్యాలీలో 101 మంది రైతులమే వస్తామని అనుమతి తీసుకున్నారు. ఆ 101 మంది జాబితా ప్రకారం అనుమతి ఉన్న రైతులనే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు అందరం గుంపుగా ర్యాలీకి వస్తామంటేనే అడ్డుకుంటున్నామని పోలీసులు తెలిపారు. శింభు సరిహద్దుల్లో రైతులు, పోలీసులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. రైతులను ర్యాలీగా రాజధానిలోకి అనుమతి ఇస్తారా లేదా అనేది చూడాలి.

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

ఇది కూడా చదవండి: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

ఇది కూడా చూడండి:  నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు