/rtv/media/media_files/2025/08/17/rs-praveen-kumar-2025-08-17-07-25-13.jpg)
RS Praveen Kumar
RS Praveen Kumar: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించడానికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసిన ఈ కుట్రపై స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీం(సిట్) విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో మట్టి, ఇసుక కుంగితే జరిగిన ప్రమాదం కాదని, అలా జరిగితే స్తంభాలకు పగుళ్లు రావని ఆయన అన్నారు. కానీ, మేడిగడ్డ కు పగుళ్లు వచ్చాయన్నారు. జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు వాడితేనే ఇలా పగుళ్లు వస్తాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
ఇది కూడా చదవండి: ఏం మనిషివిరా... ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి ఆపై..
2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ పేలుడు శబ్దాలు వచ్చాయని స్థానిక ప్రజలు చెప్పడమే కాకుండా అవి రెండు కిలోమీటర్ల వరకు శబ్ధాలు వినిపించాయని రవికాంత్ అనే అసిస్టెంట్ ఇంజినీర్ ఫిర్యాదు చేశాడని గుర్తు చేశారు. ఆయన ఫిర్యాదుతో మహదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అసాంఘిక శక్తులు బ్యారేజీని కూల్చడానికి కుట్ర పన్నినట్లు ఆ ఇంజనీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కేసు రెండేళ్లుగా పెండింగ్‌లోనే ఉందని ఆయన తెలిపారు. కాగా ఈ కేసును కుట్ర కోణంలో విచారించి, నిజానిజాలు తేల్చాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి:తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...
మేడిగడ్డ బ్యారేజీ కుంగితే శబ్దాలు వచ్చే అవకాశం లేదని, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేసే కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. ఇంజినీర్ ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు అసాంఘిక శక్తులు ఎవరో కనుక్కోలేదన్నారు. 2022లో రికార్డు స్థాయిలో వరదలొచ్చినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తట్టుకున్నాయని గుర్తు చేశారు. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయింది? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాయగానే విచారణ కోసం ఎన్‌డీఎస్‌ఏ వచ్చింది. ఉత్తరాఖండ్‌లో మొత్తం డ్యామ్ కొట్టుకుపోతే అక్కడికి ఎన్‌డీఎస్‌ఏ ఎందుకు వెళ్లలేదు? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మేడిగడ్డలో పిల్లరును ఎవరో పేల్చే కుట్ర చేశారన్నారు. మహదేవ్‌పూర్ పోలీసులు వెంటనే విచారణ చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా సిట్ ఏర్పాటు చేసి నిజానిజాలు తేల్చాలి’ అని ప్రభుత్వాన్ని ప్రవీణ్ కోరారు.
Also Read : ఎంత గొప్ప మనసయ్యా.. రూ.13వేల కోట్లు విరాళమిచ్చిన వ్యాపారవేత్త