Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలు!
తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.