డ్రగ్ టెస్ట్ కు రేవంత్.. కేటీఆర్ తరఫున వాదిస్తా.. రఘునందన్ సంచలనం డ్రగ్ టెస్ట్ కు తనతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమని ఆ పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేయించుకోవడంతో పాటు.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ చేయించాలని కోరారు. న్యాయం కుంటే కేటీఆర్ తరఫున కూడా వాదిస్తానన్నారు. By Nikhil 30 Oct 2024 in తెలంగాణ మెదక్ New Update షేర్ చేయండి సోషల్ మీడియా కోసం ఖర్చు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని రఘునందన్ రావు అన్నారు. కేసులో న్యాయం ఉండి ఫీజు ఇస్తే కేటీఆర్ తరఫున వాదిస్తానన్నారు. తెలంగాణ అంటే తాగుబోతుల పంచాయితీ అంటూ అనే రీతిలో ఎవరైనా అంటే అది సంస్కారం కాదని ఫైర్ అయ్యారు. దసరాకు పార్టీ చేసుకుంటారు కానీ దీపావళి రోజు ఎవరైనా పార్టీ చేసుకుంటారా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ డ్రగ్ పరీక్షల కోసం బ్లడ్ ఇవ్వడానికి సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బ్లడ్ నమూనాను ఇవ్వాలని కోరారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు.. ప్రజా ప్రతినిధులందరం పరీక్షలు చేయించకోవాలన్నారు. ప్రభుత్వం ఇందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ కోసమే.. హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉన్న కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకుండా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చి మూసీలో పోస్తామని సీఎం రేవంత్ చెప్పడంపై ఫైర్ అయ్యారు. ఇందుకోసం అదనంగా రూ.5 వేల కోట్లను ఖర్చు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ లబ్ధికోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. RTVకి రఘునందన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి ఇంటర్వ్యూను పై వీడియోలో చూడండి. #ktr #revanth-reddy #raghunandan rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి