Revanth Reddy: ఏడాదిలో పొలిటికల్ గా కేసీఆర్ ఖతం చేస్తా.. తర్వాత కేటీఆర్.. చిట్ చాట్ లో రేవంత్ సంచలనం

కేసీఆర్ అనే పదం ఏడాది తర్వాత వినిపించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని తన అభిమతమన్నారు. ఇందుకోసం ఆయన కొడుకునే వాడానన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో అనేక కీలక విషయాలను వెళ్లడించారు.

author-image
By Nikhil
New Update
KCR KTR Revanth reddy Chit chat

కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం ఆయన కొడుకునే వాడానన్నారు. ఈ రోజు మీడియాతో ఆయన చిట్‌చాట్‌ చేశారు. కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందన్నారు. కేసీఆర్ అనే పదం ఏడాది తర్వాత వినిపించదన్నారు. భవిష్యత్‌లో కేటీఆర్ ను రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్‌రావును వాడతానన్నారు. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసన్నారు. బావతో కేటీఆర్ రాజకీయం ముగుస్తుందన్నారు. జన్వాడ ఫామ్‌ హౌస్‌ ఇష్యూపైనా రేవంత్ స్పందించారు. దీపావళి అంటే చిచ్చుబుడ్లను చూస్తాం కానీ కేటీఆర్ బావమరిది ఇంట్లో సారా బుడ్లను చూశామన్నారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదని ఎద్దేవా చేశారు. రాజ్‌ పాకాల ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని.. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారని ప్రశ్నించారు. దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్‌, విదేశీ మద్యం ఎందుకు దొరికాయన్నారు. 

Also Read :  చిరంజీవి Vs మోహన్ బాబు.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

Also Read :  చిరంజీవి Vs మోహన్ బాబు.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

మూసీ అభివృద్ధి ఇలా..

ఎవ్వరు ఎంత ఎంత అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవం చేసి తీరుతానన్నారు. మొదటి ఫేస్ లో 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తామన్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతామన్నారు. నెల రోజుల్లో డిజైన్లు పూర్తి అవుతాయన్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామన్నారు. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామన్నారు. బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read :  గుంతల రోడ్డుపై యముడి లాంగ్‌జంప్‌ పోటీలు

బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణం చేపడతామన్నారు. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగామన్నారు. 15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామన్నారు. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్  వెజిటేరియన్  కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్,నేచర్ క్యూర్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read :  మా సినిమా కూడా సంక్రాతికే..కానీ? 'తండేల్' రిలీజ్ పై డైరెక్టర్ అప్డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు