కేటీఆర్ పోయి అమెరికాలో బాత్రూంలు కడుక్కో.. రఘునందన్ సంచలన కామెంట్స్!

కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ళ యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు బంద్ చేయాలని భావిస్తే ఆయనను ఎవరూ వద్దు అనరని.. అమెరికా పోయి బాత్రూంలు కడుక్కోవాలని సూచించారు.

New Update

కేటీఆర్ రాజకీయాలను బంద్ చేయాలని భావిస్తే.. ఎవరూ వద్దు అనరని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కావాలంటే ఆయన అమెరికా వెళ్లి బాత్ రూంలు కడుక్కోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ కు ప్రజలను కలిసే సమయం దొరకలేదన్నారు. మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నా.. ఏమైనా నష్టం జరిగిందా? అని ప్రశ్నించారు. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు.. ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసం.. అని ఫైర్ అయ్యారు. మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారని ప్రశ్నించారు. 


ఇది కూడా చదవండి: BIG BREAKING: 'తెలంగాణకు కొత్త సీఎం'

ఫామ్ హౌజ్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాల్సిందే..

కేటీఆర్ మోకాళ్ళ యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరన్నారు. కేటీఆర్ కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదన్నారు. ఫామ్ హౌస్ కేసులో పాలేవో.. నీళ్ళేవో తెలాలంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాల్సిందేనన్నారు. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా? అని ప్రశ్నించారు. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు కూడా పేలలేదని ఎద్దేవా చేశారు. 

ఇది కూడా చదవండి: ''రాజకీయాలను వదిలేద్దామనుకున్నా''.. ఎక్స్‌లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన కేటీఆర్‌..

Advertisment
తాజా కథనాలు