పోలీసుల అరాచకం.. గంజాయి స్మగ్లర్లతోనే కుమ్మక్కు ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో విఫలమైన క్రమంలో మల్డీజోన్-2లో ఇటీవల ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నలుగురి వ్యవహారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 02 Nov 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి పోలీస్ శాఖలో అధికారుల అక్రమాలు బయటపడుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో విఫలమైనందుకు మల్డీజోన్-2లోని తొమ్మిది జిల్లాల్లో ఇటీవల ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో నలుగురి వ్యవహారం బయటపడింది. వీళ్లు ఏకంగా గంజాయి స్మగ్లర్లతో మిలాఖత్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. మల్టీజోన్-2 లో ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. Also Read: కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు ఐజీ ఉత్తర్వులు దొరికిన గంజాయిని రెండుసార్లు వదిలేసి స్మగ్లర్ల నుంచి ఆ పోలీసులు డబ్బులు తీసుకున్నారిని తెలియడంతో మల్డీజోన్-2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. పటాన్‌చెరులో ఎస్సైగా పనిచేస్తున్న అంబారియా, వెకెన్సీ రిజర్వులో ఉన్న ఎస్సై వినయ్‌కుమార్, సంగారెడ్డి సీపీఎస్ హెడ్‌కానిస్టుల్ మారుతి నాయక్, అలాగే మనూర్ ఠాణా ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మధుపై సస్పెన్షన్ వేటు పడింది. పోలీసుల గంజాయి దందా వినయ్ గతంలో సంగారెడ్డి రూరల్ ఠాణాలో పనిచేస్తున్నప్పుడు ఇసుక అక్రమ రవణాను అరికట్టడంలో విఫలం కావడంతో ఆయన్ని వీఆర్‌కు పంపించారు. గతంలోనే అతడికి గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉండేవి. ఈ సమయంలోనే మారతి నాయక్, మధుతో పరిచయం ఏర్పడింది. ఇక అంబారియాతో కలిపి మొత్తం నలుగురూ కలిసి గంజాయి దందా నడిపించారు. Also Read: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. కొత్తగా మరో స్కైవాక్, ఎక్కడంటే? సంగారెడ్డి జిల్లా చిరాగ్‌పల్లి, బీడీఎల్ భానూర్ ఠాణాల పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న కొందరు దుండగులు పోలీసులకు దొరికారు. వాళ్ల ఒక నిందుతుడి ఫోన్ పరిశీలించగా కానిస్టేబుల్ మధు ఫోన్ నెంబర్ కనిపించింది. నిందితుడిని ప్రశ్నించడంతో గంజాయి రవాణా ఇన్ఫార్మర్‌గా తనను వాడుకుంటున్నట్లు చెప్పాడు. చివరికి ఆ నలుగురు పోలీసుల మిలాఖత్ వ్యవహారం బయటపడింది. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వీళ్లు స్మగ్లర్ల వాహనాన్ని పట్టుకొని డబ్బులు తీసుకొని వాళ్లని వదిలేసేవారు. ఎట్టకేలకు ఈ వ్యవహారం బయటపడటంతో తాజాగా ఆ నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. #telugu-news #police #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి