కొండా సురేఖకు రేవంత్ వార్నింగ్.. అందరి ముందే ఏమన్నాడంటే?

పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్న కుల గణనపై గాంధీ భవన్ లో నిర్వహించిన అవగాహన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ, జగ్గారెడ్డిని ఉద్దేశించే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

New Update
Konda Surekha Revanth reddy

పార్టీ నేతలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్న కులగణనపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కొందరు తరచూ పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌ హెచ్చరించారు. కొందరి వ్యాఖ్యలు పార్టీకి మైనస్ అవుతున్నాయనే భావనలో సీఎం, పీసీసీ చీఫ్ ఉన్నట్లు తెలుస్తోంది. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిసైడ్ అయినట్లు సమాచారం.


ఇది కూడా చదవండి: Indiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

సురేఖ వివాదం చల్లారక ముందే జగ్గారెడ్డి వ్యాఖ్యలు

ఇటీవల కేటీఆర్, నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఆ వివాదం చల్లారక ముందే కలెక్టర్‌పై జగ్గారెడ్డి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు రావాలని ఎంపీ అనిల్, ఎమ్మెల్సీ బల్మూరి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి మరో కీలక బాధ్యత.. ప్రకటన విడుదల చేసిన హైకమాండ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు