అఘోరి ఇంటి దగ్గర హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న భక్తులు! లేడీ అఘోరీ ఇంటి ముందు హై టెన్షన్ నెలకొంది. ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించిన అఘోరి పోలీసులు అడ్డుకోవడంతో ఇంట్లోనే నిర్బంధంలో ఉంది. దీంతో అఘోరీ నెక్స్ట్ ఏం చేయబోతోందని ఉత్కంఠగా మారింది. మరోవైపు అఘోరీని చూసేందుకు ఆమె ఇంటికి పెద్దయెత్తున భక్తులు వస్తున్నారు. By Archana 01 Nov 2024 in మెదక్ Latest News In Telugu New Update Lady Aghori Naga Sadhu షేర్ చేయండి Lady Aghori Naga Sadhu: లేడీ అఘోరి నాగసాధువు ఇంటి దగ్గర హై టెన్షన్ చోటుచేసుకుంది. అక్టోబర్ 29న ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న లేడీ అఘోరినీ చూసేందుకు భక్తులు పెద్దయెత్తున ఆమె ఇంటికి వస్తున్నారు. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న అఘోరీ నెక్స్ట్ ఏం చేయబోతుందా అని ఉత్కంఠగా మారింది. అఘోరీ ఆగ్రహం ఇంట్లో నిర్బంధించడం పై అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అక్కడి భద్రతను ఏసీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అఘోరీ బయటకు రాకుండా ఆమె ఇంటి వద్ద ఒక ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లను ఉంచారు. ఆమెను ఎవరూ కలువకుండా పోలీసుల భద్రత చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అఘోరిని నిర్బంధం నుంచి బయటకు తీసుకురావడానికి హైదరాబాద్ నుంచి ఆమె లీగల్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఇది ఇలా ఉంటే తెలంగాణలో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ హాట్ టాపిక్‌గా మారింది. నగ్నంగా పలు ఆలయాలు సందర్శిస్తూ అక్కడ పూజలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను చాలా మీడియాలు ఇంటర్వ్యూ చేశాయి. ఆపై మళ్లీ కేదరినాథ్ వెళ్లిపోయిన ఆ లేడీ అఘోరీ మళ్లీ తిరిగి అక్టోబర్ 29న వస్తానని తెలిపింది. ఆమె అనుకున్నట్లుగానే అక్టోబర్ 29న తెలంగాణకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం సందర్శించిన అఘోరీ.. సనాతన ధర్మంపై పోరాటంలో భాగంగా ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించింది. ఈ ఆత్మార్పణలో తాను చనిపోతే శివుని దగ్గరకు వెళ్లిపోతానని.. చావకపోతే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపింది. అక్టోబర్ 31న ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో.. అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: కత్తులతో నరికి ఎలా చంపారంటే?.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి ! ఇది కూడా చదవండి: VIRAT: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి