/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t12504232-2025-11-04-12-52-26.jpg)
CHAMAKURA MALLA REDDY
చామకూర మల్లారెడ్డి(mallareddy) ..పరిచయం అక్కరలేని పేరు. తన పేరుతోనే కాలేజీలు(mallareddy college latest news) పెట్టడంతో పాటు రాజకీయ నాయకుడిగా కూడా అందరికీ సుపరిచితుడు. పూలమ్మిన..పాలమ్మిన...స్కూల్ పెట్టిన..కాలేజీ పెట్టిన అంటూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఒక రకంగా తెలంగాణలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌న్ క్రియేట్ చేసకున్నాడు మల్లారెడ్డి. ఆయన సరదా మాటలు, పంచ్ డైలాగులు కూడా బాగా ఫేమస్. ప్రస్తుతం ఆయన మేడ్చల్ నియోజకవర్గ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే ఆయన తన బ్రాండ్‌ను దేశమంతా విస్తరించాలనుకుంటున్నారట. తెలంగాణలో ఆయన పేరుతో విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. డీమ్డ్ యూనివర్శటీలు. ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి.
Also Read: Air India Crash Survivor: నిత్యం నరకం అనుభవిస్తున్నా...ఎయిర్ ఇండియా ప్రయాదంలో బతికిన వ్యక్తి ఆవేదన
Malla Reddy Wants To Expand His Brand Across The Country
కాగా తన విద్యాసంస్థలను దేశమంతా విస్తరించాలనుకుంటున్నాడట. అందులో భాగంగా ఆయన ఏపీలో తొలి అడుగువేశారు. ఏపీలో తన విద్యా సంస్థల్ని విస్తరించే దిశగా బిగ్ ప్లాన్ చేశాడు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన వేంకటేశ్వరుడి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మల్లా రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాను తిరుపతిలో ఇటీవలే ఓ ఇంజినీరింగ్ కాలేజీని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు విశాఖపట్నంలోనూ ఓ కాలేజీని కొనుగోలు చేశానన్నారు.. తిరుపతిలో కాలేజీని కొనుగోలు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ తిరుమల శ్రీవారి దయతో తాను దేశమంతా యూనివర్సిటీలు, కాలేజీలు పెట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. అయితే మల్లారెడ్డి తిరుపతిలో కాలేజీని కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : వెంటాడిన మృత్యువు.. ట్రైన్ మిస్ కావడంతో బస్ ఎక్కి.. ముగ్గురు అక్కాచెళ్లెళ్ల కన్నీటి కథ!
తిరుపతిలో కొనుగోలు చేసిన మల్లారెడ్డి.. అక్కడ మల్లారెడ్డి బ్రాండ్‌తో విద్యా సంస్థను ప్రారంభించాలని భావిస్తున్నారట. ఏపీలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థల్ని ఏర్పాటు చేసే దిశగా మల్లారెడ్డి అడుగులు వేస్తున్నారట. గతంలో ఉండి మూసివేసిన కాలేజీలను కొనుగోలు చేయడంతో పాటుగా కొత్తగా కూడా కొన్ని విద్యా సంస్థల్ని స్థాపించాలని మల్లారెడ్డి భావిస్తున్నారట. తాను ప్రజా సేవ చేయడానికి యూనివర్శిటీలు, కాలేజీలు నడిపిద్దామనుకుంటున్నట్లు ఇటీవల మల్లారెడ్డి చెప్పుకున్నాడు. పాల మల్లారెడ్డిని కాస్త విద్యావేత్తగా ఎదిగానని.. దేశవ్యాప్తంగా డీమ్డ్ వర్సిటీలు, ఆస్పత్రులు స్థాపించి పేద ప్రజలకు విద్య, వైద్యాన్ని అందిస్తానన్నారు. ఆయన చెప్పుకున్నట్లే విద్యా సంస్థల విస్తరణ చేపట్టారు.
Also Read : టీమిండియా జట్టులో నో ప్లేస్.. కానీ ఫైనల్ మ్యాచ్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్
Follow Us