/rtv/media/media_files/2025/11/04/air-india-survivor-2025-11-04-09-19-40.jpg)
Air India Crash Survivor Viswas Kumar
అహ్మదాబాద్(ahmedabad) నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది(air india accident). ఇందులో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు(Air India Crash Survivor). అతనే విశ్వాస్ కుమార్ రమేశ్. ఈయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. బ్రిటన్ లో నివాసం ఉంటున్న విశ్వాస్ గుజరాత్ లో ఉన్న తన కుటుంబాన్ని కలిసి వెళుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ రోజు విమానంలో 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం తర్వాత దెబ్బలతో నడుచుకుంటూ బయటకు వచ్చారు. ఇదే ప్రమాదంలో విశ్వాస్ తన సోదరుడు అజయ్ ను కోల్పోయారు.
Also Read : సీరియల్ నటికి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..
ఆ భయంకర జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి..
పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అందరైూ చనిపోయిన ఒక్కడే బతికి బట్టకట్టడంతోవిశ్వాస్ ను అందరూ లక్కీ మ్యాన్ అన్నారు. అయితే ఆయన మాత్రం రోజూ చస్తూ బతుకుతున్నా అని చెబుతున్నారు. ఆ రోజు నుంచీ నిత్యం నరకం అనుభవిస్తున్నా అని తెలిపారు. ప్రమాదం తర్వాత తన జీవితమే మారిపోయిందని విశ్వాస్ కుమార్ చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నా తమ్ముడిని పోగొట్టుకున్నాను. అతను నాకు అన్నింటిలో అండగా ఉండేవాడు. ఇది నాకు ఎప్పటికీ తీరని లోటు. అంతేకాదు ఈ ప్రమాదం తర్వాత కుటుంబ పరిస్థితి మొత్తం తలకిందులు అయిపోయింది. విమాన ప్రమాదం భయంకర జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయినివిశ్వాస్ చెప్పారు. దాన్ని తులుచుకున్నప్పుడల్లా రాత్రుళ్లు నిద్రపట్టడం లేదని.. తన భార్య, కొడుకు, కనీసం తల్లితో కూడా మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. ఓ వైపు గదిలో కూర్చుని నేను.. అవతల అమ్మ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పటికీ నా కాలు, భుజం, మోకాలు, వెన్ను నొప్పులు ఉన్నాయి. సరిగ్గా నడవలేకపోతున్నా, డ్రైవింగ్ కూడా చేయలేకపోతున్నాను అన్ని చెప్పారు. ప్రమాదం తర్వాత భారత్‌లో మా వ్యాపారం మూతపడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది. ఎయిర్ ఇండియా ఇచ్చిన నష్టపరిహారం సరిపోలేదు. చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొటున్నాననివిశ్వాస్ వివరించారు. ఈ ప్రమాదంలో తనొక్కడినే ఎలా బయటపడ్డాననే విషయం అర్థం కావడం లేదని అన్నారు.
Also Read: H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు శుభవార్త..ప్రాసెసింగ్ రీస్టార్ట్
Follow Us