Paddy Bonus: గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
TG: రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొంది.
TG: రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొంది.
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసుపై విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు నిరాకరించింది.
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. వర్శిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
తనను హత్య చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ దగ్గర నుంచి రూ.25 కోట్లు రేవంత్ తీసుకున్నాడన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ పిలుపుతో తన నెల జీతం రూ.1.90 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు అందిస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. అర్చకులు సీఎంకు ఆశీర్వాదం అందించారు.
తెలంగాణ లో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. పలు జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడం వల్ల సుమారు 117 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఇల్లు కూలి తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమమ్మ(78), అంజిలమ్మ (35)గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.