అక్కా నోరు జాగ్రత్త.. మంత్రి కొండాకు సీఎం రేవంత్ వార్నింగ్!

TG: కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వ్యక్తిగత ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించాలని ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.

New Update
CM REVANTH

CM Revanth Reddy: కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కొండా సురేఖకు ఫోన్ చేసి ఆయన మాట్లాడినట్లు సమాచారం. వ్యక్తిగత ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించాలని ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. అక్కినేని ఫ్యామిలీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్...

మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు తీవ్రంగా దూషించుకుంటున్నారు. కేటీఆర్ మినిస్టర్ గా ఉన్న టైంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారన్నారు సురేఖ. ఆయనకు  తల్లి అక్కా, చెల్లి లేరా? అంటూ ఫైర్ ఆయ్యారు. కేటీఆరే మహిళలను కించపరిచేలా పోస్టులు తన టీమ్ కు చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు. దాంతో పాటూ గతంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మంత్రి సీతక్కపై కూడా గతంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా పోస్టులు పెట్టిందని ఫైర్ అయ్యారు. 

ఇప్పుడు బీసీ మహిళ అయిన తనను కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు సురేఖ. ఇంకా కొందరు హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవటానికి, సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం కూడా కేటీఆర్ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే కదా అంటూ కేటీఆర్‌‌ను ప్రశ్నించారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు