Telangana : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే ..వానలు!

రాష్ట్రంలో మ‌రో రెండు రోజుల పాటు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

New Update
tg rains

Telangana : తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. 

Also Read: నానే బియ్యం బతుకమ్మకు నైవేద్యంగా ఏం పెడతారు..?

నేడు  వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల్ నిజామాబాద్, రాజ‌న్న సిరిసిల్ల‌, సిద్దిపేట‌, యాదాద్రి, రంగారెడ్డి, హైద‌రాబాద్, మేడ్చ‌ల్, వికారాబాద్, సంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు అక్క‌డ‌క్క‌డ పడే అవకాశాలున్నాయి.

Also Read:రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

6వ తేదీన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, గ‌ద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి,  జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వ‌ర్షాలు అక్క‌డ‌క్క‌డ కురిసే అవ‌కాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 7వ తేదీన సిద్దిపేట‌, యాదాద్రి, రంగారెడ్డి, హైద‌రాబాద్, మేడ్చ‌ల్, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, మ‌హబూబాబాద్, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, వికారాబాద్, సంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు అక్క‌డ‌క్క‌డ కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

Also Read: జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు: సుప్రీంకోర్టు

ఇక హైద‌రాబాద్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో చ‌ల్ల‌ని గాలులు వీస్తూ.. ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. భారీ వ‌ర్షానికి భాగ్య‌న‌గ‌రం త‌డిసి ముద్దైంది. నగరంలో ఒక్కసారిగా వర్షం పడుతుండడంతో మధ్యాహ్నం నుంచి  ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగింది. 

Also Read: కేసీఆర్ సేఫేనా?.. మంత్రి వ్యాఖ్యలతో అనేక అనుమానాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు