Rains: తెలంగాణలో  రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వానలు!

తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సు ఉన్నట్లు అధికారులు వివరించారు.

New Update
thunders

Telangana: తెలంగాణలో (Telangana) రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే ఛాన్సు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు.

Also Read: మాకూ గౌరవం అవసరం– మంచు విష్ణు, రాజమౌళి

అక్టోబరు 4 వరకు వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు,  జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.

Also Read:యూపీలో ఘోరం..టీచర్ కుటుంబం హత్య

అక్టోబరు 4వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. 

Also Read: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం..చమురు మీద భారీ ప్రభావం

అక్టోబరు 5వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి,  జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సులున్నాయని అధికారులు తెలిపారు.

Also Read: ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణుదాడి..భారత్‌కు పొంచి ఉన్న ముప్పు

Advertisment
Advertisment
తాజా కథనాలు