పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్
లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అయిన నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్ లో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే.. ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.