Telangana: పంజా విసురుతున్న చలి పులి...దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది.హైదరాబద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

New Update
Weather: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రహదారులను కమ్మేస్తున్న పొగమంచు..

Telangana: తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగ మంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Also Read: Soudi: రాజద్రోహం, అత్యాచారం నేరాల కింద సౌదీలో ఈ ఏడాది 214 మంది ఉరి!

రాష్ట్రంలో గరిష్టంగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోతున్నట్లు అధికారులు వివరించారు. ఇక హైదరాబద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Also Read: విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా.. విడాకులు పై నోరు విప్పిన రెహమాన్‌!


చలికాలంలో వేడివేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమో తీసుకోవాలి. శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. కూల్గా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఐస్‌క్రీం, చల్లగా ఉన్న నీళ్లను, జూస్‌ను తాగడం వల్ల జలుబు, శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయని వైద్యులు తెలిపారు. వాటికి దూరంగా ఉంటే మంచిది. గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలి. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండాలి. అత్యవసరం అయితే తప్పనిసరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. చెవుల్లోకి చల్లని గాలి వెళ్లకుండా రక్షణ కలిగించే దుస్తులు వేసుకోవాలని వైద్యులు తెలిపారు.

Also Read: Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు!

Also Read: విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించండి.. బ్రిటన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు