CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! TG: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి సంబంధించి సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అన్నారు. By V.J Reddy 23 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలింపు అంశంపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ, జలమండలి అధికారుల సమావేశంలో సమీక్షించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి సంబంధించి సమగ్రమైన నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకు వచ్చే నెల 1వ తేదీ వరకు టెండర్ల ప్రక్రియకు కార్యాచరణను రూపొందించాలని అన్నారు. Also Read: Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం.. పూర్తి అధ్యయనం జరగాలి... హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపు ప్రణాళికలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. నీటి లభ్యత, ఏ ప్రాజెక్టు నుంచి ఎంతమేరకు నీటిని తరలించాలి, ఎంత ఖర్చవుతుందన్న విషయాలపై పూర్తి అధ్యయనం జరగాలని ఆదేశించారు. ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. Also Read: మహా కింగ్... 26న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం! ఈ నెల 30న... ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్నగర్లో నిర్వహించే రైతుల కార్యక్రమాన్ని బహిరంగ సభలా కాకుండా వారికి అవగాహన కల్పించే రైతు సదస్సుగా నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆధునిక సాగు పద్ధతులు, మెళకువలపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. సభలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడే విధంగా ఇటీవలి కాలంలో వివిధ కంపెనీల వినూత్న ఉత్పాదనలన్నీ స్టాళ్లలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని.. ఆధునిక పరికరాల వినియోగం, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్ల వాడకం వంటి సాంకేతిక పరికరాలన్నింటినీ సదస్సు నిర్వహించే చోట ప్రయోగాత్మకంగా ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలను అధికారులకు సూచించారు. Also Read: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా? Also Read: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం.. #telangana #drinking-water #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి