నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికిన భార్య.. అలా చేసినందుకే! తెలంగాణలో మరో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న భర్త ఈశ్వరయ్యను భార్య ఎల్లమ్మ గొడ్డలితో నరికి చంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వట్టిపల్లిలో చోటుచేసుకుంది. పరారిలో ఉన్న ఎల్లమ్మకోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 24 Nov 2024 in క్రైం మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Crime: తెలంగాణలో మరో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికి చంపింది ఓ భార్య. అర్థరాత్రి ఇంట్లోనే కలిసి పడుకోగా తెల్లారేసరికి భర్త రక్తపు మడుగులో పడి ఉండటం కలకలం రేపింది. భర్త హత్య నేపథ్యంలో భార్య ఇంట్లో లేకపోవడంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హతమార్చి ఇంట్లో నుంచి పారిపోయిందని చెబుతున్నారు. ఈ దారుణమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి తలుపులు తీయకపోవడంతో.. వట్టిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(50) ఎల్లమ్మ భార్యభర్తలు. కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రోజులాగే అన్నం తిని పడుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 దాటినా ఇంటి తలుపులు తీయకపోవడంతో గ్రామస్తులు డోర్ ఓపెన్ చేసి షాక్ అయ్యారు. రక్తపు మడుగులో పడున్న ఈశ్వరయ్యను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఇది కూడా చదవండి: విశాఖలో దారుణం.. వేధింపులు భరించలేక టీచర్ ఆత్మహత్య దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈశ్వరయ్యను గొడ్డలితో నరికినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఎల్లమ్మ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే భార్యనే హత్య చేసిందా? లేక ఇంకెవరైనా చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: అది చిన్న సరదా.. స్టార్క్ కవ్వింపుపై స్పందించిన హర్షిత్ రాణా! #husbend #murder #wife మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి